CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి

Share it:

 



*తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  బోయినపల్లి వినోద్ కుమార్ ను  మర్యాదపూర్వకంగా కలిసిన  ములుగు జిల్లా పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్

మన్యంటీవీ ఏటూరునాగారం:

 ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా  కలిసి పలు సమస్యలతో కూడిన  వినతిపత్రాన్ని అందించిన  ములుగు జిల్లా  పెసా కో-ఆర్డినేటర్  కొమరం ప్రభాకర్     మంగపేట మండల ఎన్నికల విషయాన్ని  సార్ దృష్టికి తీసుకెళ్లగా  వెంటనే స్పందించి ఎన్నికల కమిషన్ కమీషనర్ తో మాట్లాడి విషయాన్ని త్వరగా పరిష్కరించమని కోరడంతో కమిషనర్  సానుకూలంగా స్పందించారు. అలాగే కొత్తగూడా, గంగారం మండలాలను ములుగు జిల్లాలో కలుపుతూ ములుగు జిల్లాకు శ్రీ సమ్మక్క సారాలమ్మ ల వన దేవతల పేర్లను ఆ జిల్లాకు నామకరణం చేయాలని కోరారు.భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతాలకు కల్పించబడిన స్వయంనిర్ణయాధికారాన్ని (పెసా చట్టాన్ని)పటిష్టంగా అమలు చేయాలని కోరడం జరిగినది.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలలోని ఆదివాసీలు ఎదుర్కుంటున్న పొడుభూమి సమస్యపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారముగా హక్కులు కల్పించాల్సింది పోయి అటవీశాఖ అధికారులే అధివాసీలను గోసపుచుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర  ప్రణాళిక సంఘం  ఉపాధ్యక్షులు వినోద్ కుమార్  కు తెలియజేశారు. ఏజెన్సీ చట్టాలను, హక్కులను,ప్రభుత్వ జీవోలను   కాపడుకోవాల్సినటువంటి నిర్ణయం పెసా గ్రామసభలకే ఉన్నదని చట్టం చెబుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పెసా చట్టాన్ని,ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను లెక్కచేయడం లేదని   తెలియజేయగా తెలంగాణ  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి త్వరలో పోడు సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య పై స్పందిస్తూ స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువత కు స్థానిక వనరులను ఉపయోగించుకునేల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో  మంగపేట మండల పెసా అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు,  ఏటూరునాగారం మండల పెసా అధ్యక్షులు ఇర్ప వెంకటేశ్వర్లు,  కొమరం చంద్రయ్య తాడ్వాయి మండల పెసా అధ్యక్షులు ,చీమల లక్ష్మీనారాయణ గోవిందరావు పేట మండల పెసా అధ్యక్షులు,వజ్జ రాజు ములుగు మండల పెసా అధ్యక్షులు, ఈక సురేందర్ గంగారం మండల పెసా అధ్యక్షులు, గట్టి సత్యనారాయణ కొత్తగూడా మండల పెసా అధ్యక్షులు, ఇర్ప రాజు వెంకటాపురం నూగురు, ఇండ్ల సమ్మయ్య వాజేడు,గావిడి నాగబాబు కన్నాయిగూడెం, పడిగా మంగయ్య గూడూరు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: