CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిల్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తా

Share it:

 


బిల్ట్ ను సందర్శించిన తీన్మార్ మల్లన్న


తీన్మార్ మల్లన్నకు బిల్ట్ కార్మికులు సన్మానం


మన్యం టీవీ మంగపేట. 


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా ఏటూరునాగారం వాజేడు మండలతో పాటు మంగపేట మండలంలోని కమలాపురం గత కొన్ని సంవత్సరాలుగా మూత పడిన బిల్ట్ కర్మాగారంను బుధవారం నాడు సందర్శించిన తీన్మార్ మల్లన్న.బిల్ట్ కర్మాగారం సందర్శనకు వచ్చిన తీన్మార్ మల్లన్నకు బిల్ట్ కార్మికులు మాట్లాడుతూ తమ గోడును తెలియజేశారు.బిల్ట్ ఫ్యాక్టరీ 2014 ఏప్రిల్ 5 న మూతపడిందని ఇప్పటికీ ఆరు సంవత్సరముల పది నెలలు అయిన కార్మికులకు 65 నెలల నుండి జీతాలు లేక సెప్టెంబర్  2015 నుండి జీతాలు లేవు ఇప్పటికీ 34 మంది కార్మికుల ఆత్మహత్యలు మరియు వైద్యం చేయించు కోలేక డబ్బుల్లేక చనిపోయారని ఇప్పటికీ కొంతమంది కార్మికులకు పక్షవాతం ఇంకా కొంత మందికి ఆరోగ్యం బాగాలేక డబ్బులు లేక వైద్యం చేయించుకోలేక పోతున్నారని ఇప్పటికీ 150 మంది కార్మికులు రిటైర్మెంట్ అయినారు వారికి కూడా సెటిల్మెంట్ చేయలేదు చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మికుల రోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నారు కానీ జీతాలు మాత్రం ఇవ్వడం లేదు కంపెనీలో సెక్యూరిటీ డ్యూటీ కార్మికులు చేస్తున్నారు. కంపెనీ ఆస్తులు కాపాడుతున్నము అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు బిల్ట్ కాలనీలో నివాసం ఉండే కార్మికులకు క్వార్టర్స్ లో  కరెంటు నీళ్లు సెప్టెంబర్ 22 -20- 20. న నిలిపివేశారుని ఇప్పటికీ నూట ఇరవై ఐదు రోజులు కలెక్టర్ మంత్రులను సిఎండి గోపాల్ రావు అందరిని వేడుకుంటున్నామని మాకు క్వార్టర్స్ కి కరెంటు నీళ్లు సరఫరా చేయండి మేము తెలంగాణ వాళ్ళమే  అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు బిల్ట్ కార్మికులకు కరెంటు ఇవ్వమని చెబుతున్నారు కలెక్టర్ మంత్రులకు మేము కరెంటు బిల్లు పే చేస్తాము మాకు కరెంట్ ఇవ్వండి అని వేడుకున్నాము అయినా కూడా స్పందించడం లేదు మేము మా కుటుంబాలు అంధకారంలో పాములు విషపురుగుల మధ్యన భయంభయంగా బ్రతుకుతున్నాము అడవిలో ఉన్న గుత్తి కోయ వారికి కరెంటు నీళ్లు ఇచ్చారు.మేము ఛత్తీస్గఢ్ వాళ్లమా తెలంగాణ ప్రజల మా  మాకు అర్థం కావడం లేదు మా పిల్లలకు కరెంటు లేక ఆన్లైన్ చదువులు కరొన పిల్లలు హోం ఫ్రమ్ వర్క్ చేసు కొందామని వస్తే కరెంటు లేక మా ఉద్యోగాలు పోయి మా పిల్లల ఉద్యోగాలు కూడా పోయాయి ఓపిక ఉన్నవారు రోజు కూలికి పోతున్నారు పిల్లలు కూడా ఇల్లు గడవక చదువు బంద్ చేసి కూలికి వెళ్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కంపెనీకి ఏడు సంవత్సరములకు 327 కోట్లు రాయితీ ప్రకటించినది కరెంటు బొగ్గు కర్రకు కానీ ప్రభుత్వము కార్మికులను ఆదుకున్నది ఏమీ లేదు.

కంపెనీ యన్సియల్  కోర్టు పరిధిలోకి వెళ్ళినదని కంపెనీ అప్పు ఉన్న బ్యాంకర్స్ దివాలా తీసిన కంపెనీల కోర్టుకు వెళ్లారు   కోర్టు వారు ఆరు నెలలో కార్మికులకు సెటిల్మెంట్ చేయాలి కానీ ఒక సంవత్సరం అయిపోయింది ఎలాంటి పరిష్కారం చేయలేదు మాకు తేలేవరకు కార్మికులకు నెల నెల జీవనభృతి కల్పించి బిల్ట్ కార్మికుల కష్టాలను తీర్చి  ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి కర్మాగారంను తిరిగి తెరిపించాలని తీన్మార్ మల్లన్నకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఆర్ ఆదర్శ వర్కర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కె వెంకటా చారి,ఇతర కార్మికులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: