CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీలు కొమరం భీమ్ స్పూర్తితో ముందుకు సాగాలి

Share it:



👉జీవో నెంబరు 3 కొట్టి వేయడం వలన విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం

👉మా హక్కులు మావే అని అడిగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం

👉యువత ఎక్కువ శాతం విద్య వైపు మొగ్గు చూపాలి.

👉కొమరం బీమ్ స్పూర్తితో నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేశారు.

👉కాకతీయ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ ఈసం నారాయణ.

.... 

✍️బట్టా భిక్షపతి, మన్యం టీవీ ప్రతినిధి,కరకగూడెం మండలం.

మన్యం టీవీ: కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలపరిదిలోని ఐలపూరం మీని గురుకులం పాఠశాల ఆవరణలో జరిగిన ఆదివాసీ ఐక్యవేదిక ఆద్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ హక్కులు, చట్టాలు మరియు సంస్కృతి సాంప్రదాయ లపై జరుగుతున్న అవగాహన సదస్సు లో రెండవ రోజు సమావేశంలో పాల్గొన కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం జువాలజీ ప్రొఫెసర్ ఈసం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ స్పూర్తితో ఆదివాసీ యువత ఉద్యమం చెయ్యాలని అన్నారు.భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్డ్ భూభాగంలో నివసించే ఆదివాసీ లకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కొరకు జీవో 3 ని కల్పించడం జరిగింది. దీనివలన ఆదివాసీలు ఉద్యోగాలు పొందుతు,ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో సంస్కృతి సాంప్రాదాయలు కాపాడుకుంటూ వస్తున్నారు. జీవో నెంబరు 3 ని కొట్టి వేయడం వలన విద్య, ఉద్యోగ అవకాశాలు కొల్పోతున్నాం .ఇది ప్రస్తుత ప్రపంచంను గడగడ వణికిస్తున్నా కరోనా వైరస్ కంటె భయంకరమైనది అని అయన ఆదివాసీలకు గుర్తు చేశారు.ఎందుకంటే కరోనా వైరస్ కు జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి 10 మందిలో 5 మంది అయిన బ్రతికె అవకాశం ఉంది కానీ జీవో నెంబరు 3 ను కొట్టివేయడం ద్వారా ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, ఉన్నత చదువులు వైపు కూడా ఆసక్తిని కోల్పోయి చివరకు మన ఆదివాసీ జాతి అంతరించే ప్రమాదంలో ఉందన్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబరు 3 కొట్టివేసిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.ఆదివాసీ సంఘాల సంగతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: