CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెను ప్రమాదం లో ఆదివాసీలు

Share it:

 


👉భూ బదలాయింపు చట్టాలు ఆదివాసీల పాలిట శాపాలు

👉ఆదివాసీ హక్కుల రక్షణకు దీర్ఘకాలిక పోరాటాలు అవసరం

👉కలిసొచ్చే వర్గాలతో కలిసి ఉద్యమాలు నిర్మించాలి

👉ఆదివాసీలలో  ఐక్యత కొరవడింది

👉కళ్ళు తెరవకుంటే వందల సంవత్సరాలు వెనుకకు

👉ఆదివాసీ ఉద్యమానికి కొత్త రూపు తీసుక వచ్చిన విప్ రేగా కాంతారావు 

👉ఉస్మానియా విశ్వవిద్యాలయం పొలిటికల్ ఎహెచ్ వో డి ప్రో.జాడి ముసలయ్య

మన్యం టీవీ, పినపాక:అడవి అంటేనే ఆదివాసులని....అలాంటి అడవి బిడ్డల బతుకు లు  పాలకుల తీరుతో పెను ప్రమాదం లో ఉన్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం పొలిటికల్ ఎహెచ్ వో డి ప్రో.జాడి ముసలయ్య ఆందోళన వ్యక్తం చేశారు.భద్రద్రి కొత్త గూడెం జిల్లా పినపాక మండలం ఐ లాపురం మినీ గురుకులం లో ఆదివాసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కులు, చట్టాలు, సంస్కృతీ సంప్రదాయాల పై అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.బ్రిటిష్ పాలకులు తీసుకవచ్చిన భూబదాలయింపు చట్టం  ఆదివాసుల పట్ల శాపంగా మారిందన్నారు.నర్మదా,బాక్రా నoఘల్ ప్రాజెక్టుల మూలంగా లక్షలాది ఆదివాసుల బతుకులు ఆగమయ్యాయన్నారు.ఆదివాసులు తమకు ఇష్టమైన ప్రాంతంలో గడుపవచ్చు నని... అలాంటి వారిని అడవుల నుండి వెల్లగొట్టాలని చూడడం దారుణం అన్నారు. నానాటికి అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాలు,హక్కులు  కాపాడుకోవాలంటే దీర్ఘకాలిక పోరాటాలు అవసరం అన్నారు.ఆదివాసీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కులవృత్తుల వారిని కలుపుకొని ఉద్యమాలు నిర్మించాలన్నారు.ఆదివాసీ సంఘాల ఐ క్యత కొరవడింది అని...కళ్ళు తెరవకుంటే ఆదివాసీ జాతి 100 సంవత్సరాలు వెనుకకు వెళ్లడం తప్పదని ఆయన హెచ్చరించారు.భూమి ని దక్కించుకోవాలని,చట్టాలు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: