CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి ఐటీడీఏ భద్రాచలం వాహన ప్రారంభోత్సవ పంపిణీ కార్యక్రమాలు

Share it:

 


 మన్యం టీవీ భద్రాచలం ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో వేదిక లో గ్రామీణ రవాణా పథకం ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజన యువతకు రవాణా రంగంలో స్వయం ఉపాధి కల్పించుటకు కొరకు ఐటీడీఏ ద్వారా గ్రామీణ పథకం అనే వినూత్న పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా టాటా ఏసీ మెగా, టాటా ఎస్ ఎఫ్ సి పికప్, అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ మరియు మహేంద్ర బొలెరో వంటి చిన్న వ్యాపారులు వాహనాలను అందించడం జరిగింది. కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి  ఎస్ ఎస్ సి పాస్/ ఫెయిల్ అయిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. వయసు 21 నుండి 45 సంవత్సరాలు, ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల వారికి 1.50 లక్షలు మరియు పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షల మించకుండా ఉండాలి. ఈ పథకం ద్వారా పైన తెలిపిన నాలుగు రకాల వాహనాలలో దేనికైనా రూ 2,88,000 గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, యూనిట్ విలువలో 10 శాతం లేదా 50000 లబ్ధిదారుని వాటా దనం మిగతా మొత్తం బ్యాంకులో రూపంలో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రి, వి శ్రీనివాస్ గౌడ్ మంత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ టూరిజం అండ్ కల్చర్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వ విప్ తెలంగాణ శాసనసభ మరియు శాసనసభ్యులు పినపాక నియోజకవర్గం రేగా కాంతారావు, కోరం కనకయ్య జడ్పీ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, christina z chongthu ias ప్రభుత్వ కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్, మాలోతు కవిత ఎంపీ, బానోత్ హరిప్రియ ఎమ్మెల్యే, ఎం వి రెడ్డి ఇ ఐ ఎస్ జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం, గౌతమ్ ఐఏఎస్ ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ భద్రాచలం మరియు యు.వి ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: