CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమురం భీం జిల్లాలో పులి సంచారం

Share it:

 



 మన్యం టీవీ, కొమురం భీం జిల్లా : 


దహేగం మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో  పెద్ద పులి సంచరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీ అధికారులు సూచించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి పంజాకు ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. గత నవంబరు 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి హతమార్చింది. అదేనెల 29న పెంచికలపేట మండలం కొండపెల్లికి చెందిన నిర్మల అనే బాలికను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో రెండు నెలలుగా పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Share it:

TELANGANA

Post A Comment: