CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవిపై హక్కు ఆదివాసీలదే

Share it:

 


పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ  ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో కొమరం భీం మీని స్టేడియంలోతుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రవణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇప్పించుటకు తన లక్ష్యమని అటవీ అధికారులు ఇబ్బంది పెడితే తనను సంప్రదించాలని అన్నారు. ఆదివాసులని ఇబ్బంది పెట్టే అటవీ అధికారులను జిల్లా కలెక్టర్ సరెండర్ చేయాలని అన్నారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసులను వేధించడం మానుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తారని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పినపాక నియోజకవర్గం లోని పర్యటించి పినపాక నియోజకవర్గం నుండి పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతారని అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించని అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆదివాసీల సమస్యలు పరిష్కరించలేదని సాగుదారులు తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఏటూరునాగారం ని రెవెన్యూ డివిజన్ అయ్యేంతవరకు కృషిచేస్తానని అలాగే  ఏటూరునాగారం ని నియోజకవర్గంగా కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాలెం ప్రాజెక్టు నీళ్ళు ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానని (నుగూరు) వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ కాలేజీ ని ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ ఆదివాసీలు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పోడు సమస్య అని ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

  ఆదివాసీల  ప్రధాన డిమాండ్స్   ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలి,ఏటూరునాగారం  ను రెవెన్యూ డివిజన్ చెయ్యాలి, నియోజకవర్గంగా ప్రకటించాలి, హక్కు పత్రాలు ఇచ్చి ఆన్లైన్ కాని వాటికి పహానీలు మరియు రైతుబంధు ఇప్పించాలి, జనాభా లెక్కలలో "ఆదివాసి రిలీజియన్" అనే కాలాన్ని చేర్చాలి, కొత్తగూడ గంగారం మండలం ములుగు జిల్లాలో కలపాలి, ములుగు జిల్లా కు సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలి, పాలెం ప్రాజెక్టు ద్వారా ఆదివాసి రైతులకు నీరు అందించాలి, తుపాకులగూడెం బ్యారేజి నీళ్లను స్థానిక మండలాల చెరువులకు అనుసంధానం చేసి ఆదివాసి రైతులకు పంట నీరు అందించాలి, అలాగే ఆదివాసి యువతీయువకులకు ఐటీడీఏ వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలని, ఈ సభ ముకుంగా ప్రభుత్వ విప్ రేగా కు విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ   కో-కన్వీనర్ పొడెంరత్నం, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రాంమూర్తి, బిజెపి గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ, తెలంగాణ   ప్రజల పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బడే కృష్ణ, ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ముద్దబోయిన రవి, పెసా జిల్లా కో-ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, తుడుందెబ్బ జిల్లా ఉప అధ్యక్షులు వట్టం జనార్ధన్, జిల్లా కార్యదర్శి చింత కృష్ణ, పాయం జానకి రమణ, డివిజన్ కార్యదర్శి కాపుల సమ్మయ్య, మడకం చిట్టిబాబు, చింత సోమరాజు, గొంది హనుమంతు, కబ్బాక రామన్న,  సోలం సురేష్, ఆగబోయిన సాయి, సిద్దబోయిన సర్వేష్,కుచ్చింటి

 చిరంజీవి,ఎట్టి రాజబాబు, అలాగే వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆదివాసీ సంఘాల నాయకులు యువకులు యువతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: