CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలంలో తెరాస గ్రామ కమిటీ సమావేశం

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 


 ములుగు  జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్  ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో  మంగపేట మండలం లో గ్రామ కమిటీ సమావేశం  ఏర్పాటు చేయడం జరిగింది.  ఈసమావేశంలో   ధోమెడ, నిమ్మగూడెం, సంగంపల్లి,

వాగొడ్డు గూడెం  ,గ్రామ కమిటీ అధ్యక్షులు కొమరం లక్ష్మయ్య ,శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సోయం సీతయ్య   అధ్యక్షుతన  గ్రామ కమిటీ సమవేశం జరిగింది  ,గ్రామంలో  సమస్యలు ,పార్టీ బోలోపేతం       ఎంఎల్సీ  ఎన్నికల  గురించి  మాట్లాడటం జరిగింది  .


 ఎం ఎల్ సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కే మొదటి ప్రాధ్యాన్య ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. 


ములుగు జిల్లా ప్రకటించడంతో తన వంతు పాత్ర పోషించిన ఘనత పల్లా రాజేశ్వర్ రెడ్డికే  చెందుతుంది అన్నారు

అలాగే ఫిబ్రవరి 8 తేదీన  ఏటూరునాగారం లో జరిగే బహిరంగ సభకు  ఎం ఎల్ సీ పట్టభద్రులు మరియు తెరాస పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు  కావాలని మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఈ సందర్బంగా  పిలుపునిచ్చారు.

 గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమీటీ నాయకులు మాట్లాడుతూ  సీ సీ రోడ్లు,  మిషిన్ భగీరథ నీళ్ల లీ కేజి ,భూమి పట్టాల   సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ మరియు ఇతర సమస్యల గురించి మండల పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది.  

మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతు  భారతదేశం లో ఏ రాష్ట్రం లో కూడా అమలు కానీ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి గౌ ,శ్రీ   కేసీఆర్ అమలు చేస్తున్నారు. 

రైతు బంధు, కల్యాణి లక్ష్మీ,ఇరవై నాలుగు గంటల కరెంటు,  రైతు బీమా,మిషన్ భగీరథ ,కేసీఆర్ కిట్టు,వితంతువులకు  ఒంటరీ మహిళకు ఫించన్లు,   ఒక్క రూపాయికే బియ్యం వంటివి అనేక పథకాలు  ప్రవేశ పెట్టిన ఘనత మన   రాష్ట్ర ముఖ్యమంత్రి కే చెందుతుంది అని చెప్పారు. 

అలాగే గ్రామంలో  నా దృష్టికి వచ్చిన సమస్యలను ములుగు జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్  దుష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలను   పరిష్కరిస్తామని మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ  అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని  సత్యనారాయణ,     

మండల మీడియా ఇంఛార్జ్

 గుడివాడ శ్రీహరి,గౌస్ పాషా ,బాబూరావు ,నరేష్,చింతనపల్లి సాంబశివరావు సముద్రాల గోపయ్య సతిష్, నవీన్,సత్యం, శ్రీను రాజేశ్వరమ్మ, నాలుగు గ్రామ కమిటీ అధ్యక్షులు ,కార్యదర్శి లు,అనుబంధ సంఘాల,  కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: