CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొండికుంట గ్రామ పంచాయతీని మరింతఅభివృద్ధి పథంలో నడిపిస్తా

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:మొండి కుంట గ్రామపంచాయతీ ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొండికుంట గ్రామ పంచాయతీ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా  ఈ రోజు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక అవార్డు బెస్ట్ గ్రామ పంచాయతీ గా, రెండవ అవార్డు జిల్లా  ఫస్ట్ క్రిమిటోరియం గా కలెక్టర్  చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మన గ్రామ పంచాయతీ కి అవార్డులు రావడానికి సహకరించిన మొండికుంట గ్రామపంచాయతీ  ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే ఈ అవార్డులు రావడానికి సహకరించిన ప్రభుత్వ విప్, శాసన సభ్యులు గౌరవనీయులు  రేగా కాంతారావు కి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య కి, అశ్వాపురం ఎంపిపి ముత్తినేని సుజాత కి, అశ్వాపురం  జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ కి, మరియు ఇతర ప్రజాప్రతినిధులకు,మండల, జిల్లా  అధికారులకు,మా మొండికుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున, సర్పంచ్ గా నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదములు. అలాగే ఈ అవార్డులు గ్రామ పంచాయతీ ప్రజలకు అంకితం చేస్తున్నట్లుగా సర్పంచ్ మర్రి మల్లారెడ్డి తెలియపరిచారు.

Share it:

TELANGANA

Post A Comment: