CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల జోలికి వస్తే సహించేది లేదు

Share it:

 


అటవీ అధికారులు అత్యుత్సాహం మానుకోవాలి- ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు


మన్యం టీవీ, బూర్గంపాడు:


ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కొద్ది రోజులుగా పోడు భూముల విషయంలో అటవీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అటవీ అధికారుల పై సమరభేరి మోగించి విషయం తెలిసినదే....కాగా సోమవారం బూర్గంపాడు మండలం లోని సందెళ్ళ రామాపురంలో పర్యటించి పోడు భూములను పరిశీలించి, పోడు రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉందని, అటవీ అధికారుల అత్యుత్సాహం మానాలని మరోసారి హెచ్చరించారు.1986 లో ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయములో ఐటీడీఏ ద్వారా పోడు సాగు చేసుకునే ఆదివాసీ గిరిజనులకు జీవన్ ధార పథకం ద్వారా వ్యవసాయ బావిలు మంజూరు చేశారని, అట్టి వ్యవసాయ బావిలు ఉన్న  భూములను సైతం అటవీ అధికారులు అక్రమంగా ఆక్రమించుకుని మొక్కలు వేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని, ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2006 అంతకంటే ముందు నుంచే సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా, అటవీ అధికారులు మాత్రం 1986 అంతకంటే ముందు నుంచే సాగుచేస్తున్న భూములను సైతం గుంజుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 10 లో ఉన్న ఎనిమిది వేల ఎకరాలకు పట్టాలు ఇప్పిస్తానని, పొడు భూముల రైతులు ఎవరు భయపడవద్దని త్వరలోనే పోడు భూముల సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్న అని, రైతులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: