CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 గుండాల ఎంఈఓ పై సస్పెన్షన్ వేటు

Share it:


గుండాల మన్యం టీవీ: విధులకు  గైర్హాజరు అవుతున్న గుండాల, ఆళ్లపల్లి మండలాల విద్యాశాఖ అధికారి అజ్మీరా జగన్ పై సస్పెన్షన్ వేటు పడింది. కాచనపల్లి గ్రామానికి చెందిన  ఓ యువతి తనను గుండాల మండల విద్యాధికారి పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో మోసం చేశారని ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 26న కేసు నమోదు చేసింది. అదే నెల 28 నుండి ఎంఈఓ విధులకు గైర్హాజరు అవుతుండడంతో  టేకులపల్లి సీఐ, కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఫిర్యాదు మేరకు గుండాల, ఆళ్లపల్లి  మండలాల ఎంఈఓ  అజ్మేరా  జగన్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వరంగల్ ఆర్జెడి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: