CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జనవరి 25 వ తేదీన చేపడుతున్న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంను జయప్రదం చేయండి ✊సిపిఐ(ఎం)పార్టీ పిలుపు

Share it:

                         


                                     .       మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డి పల్లి మండలం,జానకిపురం గ్రామంలో సిపిఐ(ఎం)పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.నూనె కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఐ(ఎం)పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా,పోడు భూమినే జీవనాధారంగా చేసుకుని,సాగు చేసుకుంటూ ఎన్నో పేద కుటుంబాలు వారు జీవనం సాగిస్తున్నారని.అటువంటి పేదలకు పోడు భూమి హక్కు పత్రాలు ఇచ్చి,రైతు బంధు పథకం ద్వారా ఆదుకోవాల్సింది పోయి,మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా,అటవీశాఖ అధికారులను పేదలపై ఉసిగొల్పి,పోడు భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని,పేద బడుగు బలహీన వర్గాల వారిపై,గిరిజనులపై దుర్మార్గంగా అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి,పోడు భూమి నుండి బయటకు నెట్టి వెయ్యటానికి చూస్తున్నారని,అలాంటి చర్యలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పాలని,తక్షణమే అనేక సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలని,అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ,జనవరి 25 వ తారీఖున చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.సమావేశానంతరం వాల్ పోస్టర్లను విడుదల చేశారు.ఈ సమావేశంలో సిపిఐ(ఎం)పార్టీ మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం,నాయకులు లింగబోయిన వెంకటేశ్వర్లు,బాబురావు,కృష్ణ,గోసు నాగేశ్వరరావు,ఆదిలక్ష్మి,సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: