CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ నేతల చేతిన సుగంధ మిర్చి జ్ఞాపిక.....

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం టీవీ మంగపేట. 

జాతీయస్థాయిలో,  వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సుగంధద్రవ్యాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన సుగంధ మిరప జ్ఞాపికను బహుకరీంచేందుకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ప్రాంతంలో నిష్ణాతులైన సుగంధద్రవ్యాల హస్త కళాకారుల చేత తయారు చేయించిన సుగంధ మిరపకాయ జ్ఞాపికను తొలిసారిగా ములుగు జిల్లా లోని, మంగపేట మండలం, అకినేపల్లి మల్లారం గ్రామానికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ""జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్"" డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో  ""వికాస్ ఆగ్రి ఫౌండేషన్"" కార్యాలయంలో సుగంధద్రవ్యాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ""సుగంధ మిర్చి జ్ఞాపిక"" ను స్థానికులతో కలసి ఆయన పరిశీలించి, ప్రదర్శించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ, ""సుగంధ మిరపకాయ జ్ఞాపిక"" విశేషాలను వెల్లడించారు.  ""సుగంధ మిర్చి జ్ఞాపిక"" ను మొత్తం ఆరు రకాల సుగంధ ద్రవ్యాలను పొందుపరచి మిర్చి ఆకారాన్ని పోలిన కలప జ్ఞాపికను కళాకారులు రూపొందించినట్లు తెలిపారు. ఈ మిరప జ్ఞాపిక లో మొత్తం యాలుకలు 44, నల్లమిరియాలు 310, తెల్ల మిరియాలు 433,  లవంగాలు74, జాపత్రి 7, అనాస పువ్వులు 4, పొంద పరిచినట్లు తెలిపారు. సుగంధ  మిర్చి జ్ఞాపిక మొత్తం 392 గ్రాముల బరువును కలిగి ఉంటుంధన్నారు. పొందుపరిచిన సుగంధ ద్రవ్యాలను  వంట దినుసులుగా వినియోగించుకోవచ్చునన్నారు.దీని నిడివి 14 అంగుళాలు, వెడల్పు 3.5 అంగుళాలు, ఎత్తు 2.5 అంగుళాల వ్యాసార్థం కలిగి, పై భాగం పూర్తిగా మిరపకాయ పోలి, అడుగు భాగం పడవ ఆకారం లో చూపర్లను  ఇట్టే ఆకట్టుకుంటుందన్నారు. .ఈ సుగంధ మిర్చి  కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నుండి సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ ""స్పైసెస్ బోర్డు ""  మార్కెటింగ్ విభాగం నుండి ప్రత్యేకంగా తెప్పించటం జరిగిందన్నారు. త్వరలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో పలువురు జాతీయ నేతలకు సుగంధ మిర్చి జ్ఞాపికను బహూకరించనున్నట్లు సాంబశివ రెడ్డి వివరించారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన, ఉత్పత్తి చేసిన మరియు పంపిణీదారులను సాంబశివరెడ్డి చరవాణి ద్వారా అభినందించారు. వ్యవసాయరంగంలో, మార్కెటింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ సుగంధద్రవ్యాల  ప్రత్యేకత మరియు ప్రాధాన్యత నేటికీ వన్నె తగ్గలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో "" వికాస్ అగ్రి ఫౌండేషన్ "" డైరెక్టర్లు నాసిరెడ్డి  స్నేహలత, నేలపట్ల  శేషారెడ్డి చెట్టుపల్లి  తిరుపతిరావు నరేష్ ,రవి మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: