CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

Share it:

 ఆదివాసీ నవ నిర్మాణ సేన  రాష్ట్ర అధ్యక్షులు పూనేం సాయి


నూగూరు వెంకటాపురం జనవరి 27 


 గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్  ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయమై  పర్యటన  ములుగు కేంద్రంగా జరిగిన పర్యటన కుట్రపూరితమైందన్నారు.బుధవారం నాడు ఏ.ఎన్. ఎస్.నాయకులు భార్గవ్ ఆధ్వర్యంలో  మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంతం అయిన ములుగు కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు.సాధారణంగా యూనివర్సిటీ ఏర్పాటుకు సుమారు 1000 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అన్నారు.కానీ ములుగులో కేవలం 200 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని వారు ఆరోపించారు. చర్ల లేదా ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతం యూనివర్సిటీ ఏర్పాటు కి అనువుగా ఉంటుందని అన్నారు.చర్లలో ఏర్పాటు చేయటం వల్ల ఆంధ్రా, ఛత్తీస్ గడ్ ,ఒరిస్సా,మధ్య ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీల కు అనువుగా ఉంటుందని ఆయన వివరించారు.కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల మీద కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆదివాసీలను ఉన్నత విద్యకు దూరం చేయటానికి మైదాన ప్రాంతాన్ని ఎంచుకుందన్నారు. ప్రయివేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతులను ఇస్తూ పెద్ద విద్యను గద్దలకి సొంతం చేసే కుటిల ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయని అన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని కేజీల చొప్పున విద్యను అమ్ముకునే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం దిగజారిందని అన్నారు.దానికి నిదర్శనమే ప్రయివేటు విశ్వద్యాలయాల ఏర్పాటు అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా గిరిజన కేంద్ర ,రాష్ట్ర మంత్రులు విశ్వ ప్రయత్నాలు చేయటం సిగ్గు చేటు అన్నారు.కేవలం తమ వర్గానికి మేలు జరిగేలా ఈ ఇద్దరు మంత్రులు అయిన సత్యవతి రాథోడ్,కవిత  వ్యవహరించటం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. చర్ల లో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని   త్వరలోనే అన్ని సంఘాలతో ఒక సమావేశం పెట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని యావత్తు ఆదివాసీ సమాజం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని అన్నారు.ఆదివాసీల అభిప్రాయాలను తీసుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని సాయి అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: