CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి: మాజీ ఎమ్యెల్యే తాటి

Share it:

 


మన్యంటీవీ,దమ్మపేట:  త్వరలో జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్ర స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలలో గులాబీ జెండా రెపరెపలాడాలని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో దమ్మపేట మండలం లోని తాటి స్వగృహంలో జరిగిన ఐదు మండలాల స్థాయి నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. మా నాయకులు మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తామని అన్నారు. అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులకు సూచించారు. త్వరలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న సుమారు అన్ని శాఖలలో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉందని నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు  మండలాలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: