CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ నాయకపోడు అత్యవసర భేటీ

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నాలుగు జిల్లాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు అత్యవసర సమావేశమై పత్రికా ప్రకటన విడుదల చేయడమైనది. ఈ సమావేశంలో గిరిజన తెగ జాబితాలో నాయకపోడు గిరిజన తెగ ను  గుండుకు ఉప తెగ  లాగా కలిపి చూపిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నాయకపోడు జనాభా  గోండు జనాభాగా నమోదు అవుతుంది. ఈ కారణంగా నాయకపోడు తెగ వునికి అస్పష్టమైన విద్య ఉద్యోగ చట్టబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు అవకాశాలు పూర్తిగా కోల్పోయినది. నాయకపోడు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఇతర అన్ని గిరిజన తెగల కంటే చాలా వెనకబడి ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా లో నాయక పొల్ల మైసమ్మ జాతర కేంద్రాన్ని కోనా ముభాషి తెగ సమితి  పేరుకు కొందరు గోండులు నాయకపోడు జాతర సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రతి సంవత్సరం వరుస దాడులు చేస్తున్నారు దీన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాము. ముఖ్యముగా  ఈ సంవత్సరం నాయకపోడు ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ గాంధారి ఖిల్లా నాయకపోడు జాతరను అడ్డగించుట కు వారు గిరిజన సంక్షేమ శాఖ వారు నిధులు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేశారు. నాయకపోడు పై చేసిన అటువంటి అవమాన కరమైన ఫిర్యాదు గుండు కోవా ముభాషి సంక్షేమ సమితి వారిపై కేసు నమోదు చేసి నాయకపోడు కు రక్షణ కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది. గోండు తెగ నుండి ఇ నాయకపోడు జగన్ వేరు చేసి ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలని డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పూచి గోవిందరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు, పులి శ్రీను మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, రాజిని వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి, దబ్బ శ్రీను మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, దుర్గ ఖమ్మం జిల్లా మహిళా కార్యదర్శి, వరలక్ష్మి ఖమ్మం జిల్లా మహిళా కార్యదర్శి, ఆదివాసీ నాయకపోడు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాసరావు మరియు you're కార్యదర్శి  చిటిక నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: