CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

చెరువులు, కుంటలు, నదులపై గంగపుత్రులకే మొదటి హక్కు

Share it:

 బోగస్ గంగపుత్ర సర్టిఫికెట్స్ వెంటనే రద్దు చేయాలి 


*గంగపుత్రులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు*-కొంకతి సాంబశివరావు 

మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం లోని రమణక్క పేట లో గంగపుత్ర సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో (గంగ పుత్ర సంఘం) (బెస్త )ములుగు జిల్లా గంగ పుత్ర మహానాడు ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు హాజరయ్యారు. ఈ సమావేశం రమణక్క పేట గంగపుత్ర (బెస్త )సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన కొంకతి సాంబశివరావు మాట్లాడుతూ గతంలో గంగ పుత్రులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే ఎవరైనా సహించబోమని పేర్కొన్నారు.స్థానికంగా నివసించే  గంగపుత్ర (బెస్త )కులాలకు మొదటి  ప్రాధాన్యత ఇచ్చి చెరువులు, కుంటలు, నదులు మొదలగు వాటి పై హక్కు గంగ పుత్రులకే ఉంటుందని, ఇతర వర్ణాలకు ఆ హక్కు ఉండదు అని ఈ సందర్బంగా తెలియజేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జిఓ నెంబర్ "6"ను వెంటనే రద్దు చేయాలి, అలాగే జిఓ "74"ప్రకారం కులవృత్తుల ప్రకారం ఎవరి వృత్తి వారికీ కేటాయించి ప్రభుత్వసంక్షేమ పథకాలు వారికీ కేటాయించాలి. అక్రమంగా బోగస్ గంగ పుత్ర ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి పత్రాలు రద్దు చేయాలని కొంకతి సాంబశివరావు ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగే ద్వి చక్ర వాహన ర్యాలీ, మరియు ధర్నా లో అందరూ పాల్గొని గంగపుత్ర సంఘం ఐక్యతను చాటి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగ పుత్ర సంఘం క్రియాశీల నాయకులు మంచర్ల వెంకటేశ్వర్లు, ఇందారపు లక్ష్మణ్ రావు,  మంచర్ల మురళి, మంచర్ల తిరుపతి, గుమ్ముల కోటేశ్వరరావు, మాటూరి నాగేంద్ర బాబు, మంచర్ల కిరణ్, మంచర్ల వంశీ, మునిగెల రాజు, ఇందారపు చిరంజీవి, మంచర్ల గణేష్, ఇందారపు భాస్కర్, బట్టా సమ్మయ్య, బట్టా చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: