CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలను జరపాలి - నల్ల బ్యాడ్జీలతో నిరసన

Share it:

 


మన్యం టీవి,పినపాక:

ఎంతోకాలంగా జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల గా విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని అధ్యాపకులు నిరసన తెలియజేశారు. సోమవారం భోజన విరామ సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పినపాక నందు కాంట్రాక్ట్ లెక్చరర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. 13 సంవత్సరాలుగా బదిలీ లేఖ సొంత జిల్లాలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్న మని అధ్యాపకులు నిరాశ చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని, వారి యొక్క తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి సంఘాల కతీతంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల రాష్ట్ర ,జిల్లా స్థాయి నాయకులు సుదర్శన్, శ్రీదేవి, పద్మశ్రీ, శ్రీనివాస్ ,యాదయ్య, దేశపతి, రమేష్ ,స్వప్న, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: