CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభయహస్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుత్తికోయ పిల్లలకు పుస్తకాలు, ఆట వస్తువులు బట్టలు పంపిణీ

Share it:

 



 మన్యంటీవీ ఏటూరునాగారం:


చదువుతోనే సమాజ అభివృద్ధి

 చెందుతుంది అని అభయహస్త ప్రతిస్టాత్మక జాతీయ విద్యా సంస్థ నిట్... పూర్వ విద్యార్థులు  స్వచ్చందం సంస్థ (నిట్ ఎంబీఏ 2011 పూర్వవిద్యార్థులు) ద్వారా   ఏటూరునాగారం పరిధిలోని చింతలమోరి, తాడ్వాయి మండలం లోని ఊరట్టం, కాల్వపల్లి  గ్రామాల గుత్తి కోయ పిల్లలకు 50మంది కి అభయహస్త స్మైల్ కిట్లు (అందులో విద్యాపరమైన పుస్తకాలు, బట్టలు, ఆటవస్తువులు, కుటుంబాలకు నిత్యావసర సరుకులు , మహిళలకు సానిటరీ పాడ్, దుప్పట్లు, స్వీటర్లు , పిల్లలకి పోష్టిక ఆహారాలు )  అందించారు. అలాగే ఏటూరునాగారం మండలం చింతలమోరి, తాడ్వాయి మండలం ఊరట్టం గుత్తి కోయ గుంపును విద్య వైద్య పరంగా అన్నివిధాలా సహకరిస్తాం, నేటి ఆధునిక యుగంలో విద్య,వైద్యంతో పాటు కనీస సౌకర్యాలకు,జన జీవన స్రవంతికి దూరంగా ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న గిరిజనులకు,పేదలకు చేయూతనందించడమే అభయహస్త ఫౌండేషన్ ధ్యేయం ,నేటి సమాజంలో గుర్తింపు పొందాలంటే విద్యతోనే సాధ్యం అవుతుంది ,చదువుతో ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చు. మా సంస్థ ద్వారా ఇలాంటి ఎంతో మంది నిరుపేదలకు విద్య, వైద్యం అందించాలన్నది. మా లక్ష్యం అని సంస్థ అధ్యక్షుడు కార్తీక్ అన్నారు. ఈ కార్యక్రమం లో అభినయ్, అక్షయ్, సుజిత్, కార్తీక్, నిఖిల్, శివ, సంతోష్,

చేర్ప రవీందర్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: