CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంక్రాతి ముగ్గులతో మురిసిన వాకిళ్లు, రంగులతో కళ కళ లాడిన లోగిళ్ళు

Share it:

 


మన్యం టీవీ మంగపేట 

సంక్రాతి అంటేనే రంగు రంగుల ముగ్గులు, భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, మంగపేట మండలంలో సంక్రాతి ముగ్గులతో ప్రతీ వాకిలి మురిసింది, రంగురంగుల హరివిల్లులతో లోగిళ్లుకళలాడాయి.  సంక్రాతి సందర్బంగా ప్రతీ ఇల్లు, ప్రతీ వాకిలి కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రతీ ఇల్లు పండగ వాతావరణం సంతరించుకున్నది, ప్రతీ స్త్రీ ఇంటి ముందర ముగ్గులు వేస్తూ కనిపించడం విశేషం. దసరా తర్వాత అంతటి గొప్పగా చెప్పుకునే, చేసుకునే పండుగ ఏమైనా వుంది అంటే అది సంక్రాతి మాత్రమే, సంక్రాతి కంటే మొదటి రోజు భోగి వస్తుంది కానీ భోగి నాడు అమావాస్య రావడం వలన చాలా మంది నిరుత్సాహపడ్డారు కానీ సంక్రాతి నాడు ప్రతీ ఒక్కస్త్రీ ఇంటి ము ముందు ముగ్గులు వేస్తూఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మ పెట్టి, గొబ్బెమ్మలమీద గోబిపూలు, భోగి పళ్ళు, నవధాన్యాలు ఉంచి భక్తి శ్రద్దలతో ఇష్టదైవానికి మొక్కుతారు. మంగపేట మండలం మొత్తం సంక్రాతి శోభ తో మెరిసి పోయింది, కొత్త బట్టలతోఆడవాళ్లుఎక్కువ గా ఇష్టపడే ముగ్గులతో,రంగురంగు హరివిల్లులతో,పిల్లల కేరింతలతో బంధుమిత్రులపలకరింపులతో హాయిగా,సంతోషంగా పండగ జరుపుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: