CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజుపేట లో ఘనంగా 72వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

 


మంగపేట మండలం రాజుపేట గ్రామంలోఉపాధ్యాయులు నర్సయ్య సార్ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు నర్సయ్య సార్ మాట్లాడుతూ గణతంత్రము అనగా ఎన్నిక కాబడటం, గ్రామ స్థాయి సర్పంచ్  నుండి దేశ ప్రధాన మంత్రి వరకు ప్రతి ఒక్కరు ప్రజల చేత ప్రత్యక్షంగా,లేదా పరోక్షంగానో ఎన్నిక అయిన వారు మాత్రమే పరిపాలన చేయాలి అటువంటి విధానాన్ని, భారత రాజ్యాంగం ద్వారా అమలులోకి తీసుకొని వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మనం ఎల్లప్పుడు రుణ పడి ఉండాలని ఈ సందర్బంగా తెలియచేసారు. తర్వాత అతిధులు గా వచ్చిన గ్రామ పెద్ద చిన్న పుల్లయ్య మాట్లాడుతూ సంవత్సరం తర్వాత మరల ఇటువంటి జాతీయ పండుగను ఇంత ఘనంగా నిర్వహించిన నర్సయ్య సార్ అభినందనీయులని దేశంలోకరోనా మహమ్మారి నశించి మరల మనకు మునుపటిలాగే స్కూల్స్ నడిచి పిల్లలు మంచిగ చదువుకోవాలి అని సూచించారు. తర్వాత ప్రసంగించిన  అంగన్వాడీ టీచర్స్, విజయ లక్ష్మి, మేరీ కమల, జాన్షి, మల్లికార్జున, విజయకుమారి తదితరులు మాట్లాడుతూ మన ప్రజాస్వామ్యగణతంత్ర దేశంలో కేవలం అధిక సంఖ్యాకులకే కాక అల్ప సంఖ్యాకులకు కూడా రక్షణ కల్పించి, అధిక సంఖ్యాకులైన, అల్ప సంఖ్యాకులైన, అందరిని ప్రజాస్వామ్యం ఒకే తలమీద ఉంచుతుంది. కులం, జాతి, లింగ, మత బేధం లేకుండా వ్యక్తులందరి హక్కులను భారతరాజ్యాంగం కాపాడుతుందిఅంటూ ప్రజాస్వామ్యం విశిష్టత తెలియజేసారు. ఈ కార్యక్రమంలో, గ్రామప్రజలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: