CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తోట.హారిక కిడ్నీ వైద్యానికి 45 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన సింగరేణి ఉద్యోగులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కొత్త మల్లేపల్లిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తోట హారిక కు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా కు చెందిన సింగరేణి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న మణుగూరు హెల్పింగ్ హాండ్స్ 35 వేల రూపాయలు,మరికొంత మంది సింగరేణి కార్మికులు అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన మిస్సైల్ మ్యాన్ హెల్పింగ్ హాండ్స్ రూ.10 వేల రూపాయలను ఏరియా సోటో జీఎం.భోగ వెంకటేశ్వర్లు,ఏరియా గుర్తింపు సంఘం నాయకులు వుకంటి. ప్రభాకర్ రావు సింగరేణి అధికారులు ఎం.లింగబాబు చేతుల మీదుగా మల్లారం స్పెషల్ డి పార్కులో హారిక కుటుంబ సభ్యులకు రూ.45 వేల రూపాయలు అందజేశారు.చిన్నారి హారిక త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని తలంపుతో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి సేవ చేయడం అభినందనియం అని వారు యువకులను కొనియాడారు.ఆదుకునే చేతులు కూడా చల్లగా ఉండాలని వారు యువకులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త ఎం. లింగబాబు,సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా,హబీబ్,మంగీలాల్,టిబిజికెఎస్ నాయకులు సిహెచ్.అశోక్,హెల్పింగ్ హాండ్స్ సభ్యులు ఎండీ అమీనుద్దిన్,షేక్ హుస్సేన్, యాకూబ్ పాషా,జయరాజు, గాలిబ్ ఉపేందర్,సతీష్, ప్రేమ్,సాయి ఇంటూరి, యోహాన్,మిస్సైల్ మాన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు నాగేశ్వరరావు,వై.వినయ్, ఎల్.నవీన్,రవి,ప్రవీణ్, సతీష్,హరీష్,చైతన్య, తిరుపతి,మిధున్ భరత్,రవి వర్మ,ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: