CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్ ఎస్ ఎస్ కుట్రలతోనే జీఓ నెం.3 రద్దు

Share it:

 


👉5వ షెడ్యూల్ ఎత్తివేతకు కుట్రలు

,👉ఇప్పటికే కొన్ని పాంత్రాల్లో ఏజన్సీ సర్టిఫికెట్ల నిలిపివేత

👉ఓపెన్ కాస్టులతో కోయ జాతి ఉనికి ప్రశ్నార్థకం

👉భద్రాచలం నుండి నాగపూర్ రైల్వే లైన్ ఏర్పాటును అడ్డుకోవాలి

👉నిర్వాసిత గ్రామ ప్రజలకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కల్పించాలి

👉ఆదివాసీ విధ్వంస ప్రాజెక్టు పోలవరంను ఎందుకు ఆపడం లేదు

👉ఆదివాసుల అస్తిత్వాన్ని కి కుట్రలు పన్నితే తిరుగుబాటు తప్పదు

👉ఆదివాసులు పవర్ పాలిటిక్స్ చేయాలి

,👉ఆదివాసీ ల రాజకీయ చైతన్యం కోసం రాజకీయ శిక్షణ తరగతులు అనివార్యం

👉తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్

మన్యం టీవీ, పినపాక:ఆర్ ఎస్ ఎస్ కుట్రలతోనే జీఓ నెం.3 రద్దు ఐనట్లు తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మండిపడ్డారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం మినీ గురుకులం లో పినపాక మండల ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీహక్కులు,చట్టాలు, సంసృతి, సంప్రదాయాలు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. రాజకీయ చైతన్యం ఉన్న కులాలే రాజ్యం ఎలుతున్నారు అని అన్నారు.ఆదివాసీ లను భూస్థాపితం చెయ్యాలనే ఏజెండా తో ఆర్ ఎస్ ఎస్ కుట్రలతోనే కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ నిరుద్యోగ యువతకు వరమైన జీఓ నెం.3 రద్దు చెయ్యడం జరిగిందన్నారు. దీనితో 5వ షెడ్యూల్ ఎత్తివేతకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.ఇప్పటికే కొన్ని పాంత్రాల్లో ఏజన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేశారన్నారు.ప్రాజెక్టు ల మూలంగా సర్వం కోలేపోయేదిఅడవి బిడ్డలే అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.సింగరేణి ఓపెన్ కాస్టుల మూలంగా ప్రధానంగా ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మరనుందన్నారు. ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోయగూడెం,కొత్తగూడెం, మణుగూరుల లో ఓపెన్ కాస్టుల మూలంగా దెబ్బ తిన్నది  ఆదివాసి జాతి అని అన్నారు.మరో 200 వందల సంవత్సరాలలో ఈ పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోనుందన్నారు.భద్రాచలం నాగపూర్ రైల్వే లైన్ రూపంలో ఆదివాసుల కు మరో ప్రమాదం పొంచి ఉందన్నారు.ప్రాజెక్టు ల మూలంగా సర్వం కొల్పేయే భూనిర్వశిత గ్రామాల ప్రజలకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఆదివాసుల అస్తిత్వాన్ని కి కుట్రలు పన్నితే తిరుగుబాటు తప్పదని ,అవసరమైతో తమ జాతిని కపడుకివడానికి ఆదివాసీ వీరు కొమరం భీమ్ మార్గం లో తుపాకులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఆదివాసులు పవర్ పాలిటిక్స్  చేసినప్పుడే ఆదివాసీ లకు మనుగడ ఉంటుందన్నారు.ఆదివాసీ ల రాజకీయ చైతన్యం కోసం రాజకీయ శిక్షణ తరగతులు అనివార్యం అని ఈ లాంటి కార్యక్రమాలు ,చర్చలు జరగాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: