CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దర్జాగా కబ్జా.. ఏటుర్ నాగారం మండల కేంద్రంలో కొనసాగుతున్న దందా.... మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు.

Share it:


 

మన్యం టీవీ.ఏటూరునాగారం:         ఏటూరునాగారం మండల కేంద్రం .ఆకుల వారి గణపురం ఘనపురం శివారులోని రాళ్ల కుంట చెరువు శిఖం సర్వే నెంబర్ 209 భూమిలో కొందరు వ్యక్తులు అధికారుల ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారుల నుంచి వారు మామూళ్లు తీసుకుని ప్రోత్సహిస్తున్నారని బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ములుగు కలెక్టర్ ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి వారి వారి కార్యాలయం ఎదుటనే ఉన్న చెరువు శంఖంలో ఇల్లు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు...చెరువు శిఖం ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణం. మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన గల రాళ్ల కుంట చెరువు శిఖం భూమి లో నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖం ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు స్వార్ధపరులు దర్జాగా కబ్జా చేసి ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణానికి లీజుకు ఇవ్వడం జరిగింది విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు మామూళ్ల కక్కుర్తిపడి దర్జాగా కబ్జాదారులకు ప్రైవేటు సెల్ టవర్ నిర్మాణాలకు తమ ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారని ప్రజలు వివిధ ప్రజా సంఘాల నాయకులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అందరూ చూస్తుండగానే కొందరు స్వార్ధపరులు ప్రభుత్వ చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు పంచాయతీ ఉన్నతాధికారులకు తెలుసునని వారే తమను ఆక్రమించుకొని సలహా ఇచ్చారని ఆక్రమణదారులు చెప్పడం కంచే చేను మేసిన చందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు ఎవరైనా సమాచారం చేరవేసి ఫిర్యాదు చేసినట్లు అయితే రెవెన్యూ అధికారులు తాపీగా వచ్చి మొక్కుబడిగా వాటిని తొలగించి వెళ్ళిపోయి మరల నిర్మాణాలు చేపట్టడానికి వారి కనుసన్నల్లోనే దర్జాగా భూకబ్జా దందా కొనసాగుతోంది పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. . . భూములకు విలువ పెరిగి లక్షల్లో డిమాండ్ ఉండడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని బుట్ట చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.. జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు సైతం తమను కాపాడుకోవడం కోసం ముడుపులు ముట్ట చెప్పడంతో వారు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి? 209 సర్వే నెంబర్ చెరువు శిఖం ప్రభుత్వ  భూమి అధికారుల అండదండలతో ఆక్రమించుకొని ప్లాట్లుగా ఏర్పాటు చేసుకొని తమదంటే తామది గా పంపకాల జరుపుకొని. విక్రయాలు జరుపుతూ వివాదాలకు నిలయంగా మారుతోంది ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్న బాగోతం బట్టబయలు అవుతుంది.. నిబంధనలకు విరుద్ధంగా ఆకుల వారి గణపురం ఏజెన్సీ ప్రాంతంలో లో గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూములకు పట్టాలు చేసినట్లు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు...? ఇసుక క్వారీలు కేటాయించడం కోసం రెవెన్యూ అధికారులు  ఇసుక మాఫియా వద్ద  మొత్తంలో ముడుపులు తీసుకుని ఇసుక క్వారీ అప్పగించడం కోసం నిబంధనలను పాతర పెట్టి నాన్ షెడ్యూల్ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా పీసా గ్రామ సభలు నిర్వహించి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకోవడం కోసం రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారని గిరిజన సంఘాల నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలి "తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్" రాళ్ల కుంట చెరువు శిఖంలో  భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్ డిమాండ్ చేశారు.. మామూళ్ల కు ఆశపడి కబ్జాదారుల తో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాదారులను రెవెన్యూ అధికారులు ప్రోత్సహించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు... ఇష్టానుసారంగా పీసా గ్రామ సభలు.... గిరిజన సంఘాల రాష్ట్ర సలహాదారులు పొడెం రత్నం... ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వారి ఇష్టానుసారంగా పీసా గ్రామ సభలు నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంత వనరులను దోచుకోవడం కోసం ఇసుక మాఫియాకు తో కుమ్మక్కై వారికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల లో ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇసుక మాఫియా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని వారి తీరుపై ధ్వజమెత్తారు. ఏజెన్సీ ప్రాంతంలో లో గిరిజనేతరులకు సైతం రెవెన్యూ అధికారులు పట్టాలు చేసి లక్షలాది రూపాయల ముడుపులు తీసుకున్నారని ప్రభుత్వ చెరువు శిఖం భూములను భూ మాఫియా కు ముట్ట చెప్పడం వెనుక అధికారులకు కు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో నే తమను ఎవరూ ఏం చేయలేరని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చట్టాలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: