CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వందేళ్ళ సింగరేణి

Share it:





మన్యం టివి స్పెషల్ స్టోరీ 


తెలంగాణకు మకుటాయమానం గా  భాసిల్లుతున్న సింగరేణి వందేళ్ళ పండుగ జరుపుకుంటోంది. .. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలను పన్నులు, డెవిడెండ్‌ల రూపంలో చెల్లిస్తూ సిరులు కురిపిస్తోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కొన్ని రాష్ట్రాలకు బొగ్గు రవాణా చేస్తూ దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన అవసరాలు తీరుస్తోంది. గలగలా పారే గోదావరి పాదాల చెంతన 350 కిలోమీటర్ల పొడవున ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణికి డిసెంబరు 23తో నూరు వసంతాలు నిండుతాయి.


దేశంలోనే ఫస్ట్ 


- హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ పేరిట భద్రాద్రి జిల్లా ఇల్లెందు వద్ద 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది.

* 1920లో సింగరేణి కాలరీస్‌ కంపెనీగా పేరు మార్చుకుంది.

* 1945లో నిజాం ప్రభువు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో తొలి ప్రభుత్వరంగ సంస్థగా మారింది.వైద్యం...సింగరేణి యాజమాన్యం ఆరు ఏరియా ఆసుపత్రులు, ఒక ప్రధాన ఆసుపత్రి (కొత్తగూడెం), 25 డిస్పెన్సరీలను నడుపుతోంది. కార్మికులు, వారి కుటుంబాల కోసం దాదాపు 30 అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. యజమాని, శ్రామిక సంబంధాలను మానవ సంబంధాలుగా మారుస్తూ సింగరేణి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. దేశంలో అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయిన కోల్‌ ఇండియా కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు, అలవెన్సులు సింగరేణిలోనే అధికం. 1999-2000 నుంచి లాభాల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తున్న సంస్థ ఇది మాత్రమే. ఈఏడాది అత్యధికంగా లాభాల్లో 28 శాతం వాటా చెల్లించింది.సాంకేతిక పరిజ్ఞానం..

.* భూగర్భ గనుల్లో కంటిన్యూయస్‌ మైనర్‌, బీజీ ప్యానెల్‌, లాంగ్‌వాల్‌ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. మధ్య తరహా యంత్రాలైన ఎస్డీఎల్‌, ఎల్‌హెచ్‌డీ యంత్రాలూ బాగా ఉపకరిస్తున్నాయి.

* 1974లో ఉపరితల బొగ్గు గనులు ఏర్పాటు అయ్యాయి. వీటిలో డంపర్‌, షవల్‌ పరిజ్ఞానంతోపాటు, హైవాల్‌ టెక్నాలజీ, సర్ఫేస్‌మైనర్‌, డ్రాగ్‌లైన్‌ యంత్రాల ద్వారా ఉత్పత్తి సాగుతోంది.పొరుగు రాష్ట్రాల్లో బొగ్గు క్షేత్రాలు..ఒడిశాలో 1000 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న నైనీ, న్యూపాత్రపద] బొగ్గు క్షేత్రాన్ని తీసుకుంది. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో మరికొన్ని బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఒడిశాలో కేటాయించిన రెండు బొగ్గు క్షేత్రాల ద్వారా ఏటా 20 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఉంది.ఉన్నత విలువలు.

.* సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై ప్రత్యే దృష్టి సారించడంతో సంస్థ గడిచిన ఐదేళ్లలో రెట్టింపు ఉత్పత్తి, 127 శాతం లాభాలను పెంచుకోగలిగింది.

* సంస్థకు చెందిన ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాం స్వయంగా ఏటా పదివేల మొక్కలు నాటుతూ రెండేళ్లుగా ఉన్నతాధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.విద్యుత్తు వెలుగులు..

* బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన సింగరేణి మొదటి దశలో 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాన్ని (ఎస్టీపీపీ) ఏర్పాటు చేసింది. జైపూర్‌లో 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు అనుమతులు సాధించింది.

* ఎస్టీపీపీ బొగ్గు మండించడం ద్వారా వచ్చిన బూడిదను వేలంపాట ద్వారా అమ్ముతుంది. ఇలా ప్రస్తుతం నెలకు సుమారు రూ.40 లక్షల ఆదాయం పొందుతోంది.. ఇప్పటి వరకు బూడిద ద్వారా సంస్థకు సుమారు రూ.7 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.

* పర్యావరణ రక్షణ చర్యల్లో భాగంగా ఎస్టీపీపీ తీసుకుంటున్న చర్యలను రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు.

* సంప్రదాయ ఇంధన వనరులను వినియోగించుకునేందుకు సౌర విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటుకు సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 350 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లోని సౌర విద్యుత్తుకేంద్రం ద్వారా 10 మె.వా. విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది.

Share it:

SLIDER

Post A Comment: