CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యలో నాన్యతను పెంపొందిచడం కోసమే "మనఊరు మనఇగ్నైట్" కార్యక్రమం : రసాయనశాస్త్రఅధ్యాపకులు తెలంగాణ ఉద్యమకారుడు కురందుల రఘుపతి

Share it:


మన్యం టీవీ ఏటూరునాగారం:


తెలంగాణ గిరిజన సంక్షేమ మరియు తెలంగాణ  సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డా"ఆర్.యస్.ప్రవీణ్ కుమార్   మరియు డిప్యూటి కార్యదర్శి గ విద్యార్థులలో సంతోషమే ఐశ్వర్యంగా బావించి తలపెట్టిన "మనఊరు మనఇగ్నైట్ " కార్యక్రమంలో దాదాపు 20 వి.యల్.సిలకు చెందిన విద్యార్థులు పాల్గొని వారియొక్క ప్రతిభను కనబరిచారని,తాడ్వాయి లోని కామారం నందుఉన్న ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఏటూర్ నాగారం నందు ఈకార్యక్రమం జరిగిందని రఘుపతి  తెలియజేశారు.ఈ విదమైన కార్యక్రమం విద్యార్థిని 

విద్యార్థులలో విద్యతోపాటు నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలు పొందుపరుచడం కోసం, నైతిక విలువలు,మానవత్వ విలువలు పెంపొందిచడంకోసం, ఉల్లాసం కోసం,అందరి మన్ననలను పొందడం కోసం ఈకార్యక్రమంను అన్ని వి.యల్.సి లలో అందరి విద్యార్థులచే ప్రతి ఉపాద్యాయుడు  చేపడుతున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ఏటూరునాగారం నందు పనిచేస్తున్న రసాయనశాస్త్ర అద్యాపకులు రఘుపతి  తెలిపారు.ఈకార్యకార్యక్రమంలో ప్రతిభచూపిన విద్యార్థుల పేర్లను రీజినల్ కో ఆర్డినేటర్ కి,కార్యదర్శికి పంపిస్తామని,ఈ కార్యక్రమంను ఉపాద్యాయులు బ్యాచ్ లుగా 

ఏర్పడి తెలంగాణ అంతా అన్ని వి.ఎల్.సి సెంటర్ లలో విద్యార్థులలో పోటితత్వాన్ని పెంపొందించడానికిచేపడుతున్నట్లు ఆయన అన్నారు.

ప్రస్తుతం కరోనా అదికంగా విజ్రంబిస్తున్నక్రమంలో ఆరోగ్య వంతులకైన అనారోగ్యవంతులకైన  మన సంతోషమే మనఐశ్వర్యం అని దాన్ని పెంపొందించడానికె "మనఊరుమనఇగ్నైట్"

కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.

ఈకార్యక్రమంలోఎస్సేవ్రైటింగ్,

ఎలోకుషన్,స్పెల్ బీ,క్విజ్,

సైన్స్ ఫెర్,యూత్ పార్లమెంట్,మన్ ,సాంగ్స్,ఫ్యాన్సీ

డ్రెస్,డాన్స్ మొదలైనవాటి పట్ల విద్యార్థులు ఆసక్తి చూపేవిదంగా అన్ని వి.యల్.సి సెంటర్ లల్లో ఈ విదమైన కార్యక్రమాలు జరుగుతు న్నాయన్నారు.

ఈ సదర్బంగా ఈనాటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులుగా భావించి కార్యదర్శి డా"ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ,రిజినల్ కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి ,ప్రిన్సిపల్ వసుంధర  ఈ విదమైన 

కార్యక్రమాన్నీ విజయవంతం చేయుటకు ఆహర్నిశలు కృషిచేస్తున్నారని  రఘుపతి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: