CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పామాయిల్ రైతుకు నష్టం వస్తే సహించేది లేదు. -యాజమాన్యం వెంటనే స్పందించాలి. : ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


పామాయిల్ రైతుకు నష్టం వస్తే సహించేది లేదు.   

-యాజమాన్యం వెంటనే స్పందించాలి. 

-లేదంటే రోడ్లు ఎక్కాల్సి వస్తుంది.

-పామాయిల్ రైతుల ఆందోళన   మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మెచ్చా.

-ఎండి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రం* 

                                                  మన్యంటివి,అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో క్రూడ్  పామాయిల్ ఎక్కువ రేటు వచ్చినా కానీ ఆయిల్ ఫెడ్ వారు అమ్మకపోవడం వలన  రైతులు నష్టపోతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట లోని ఆయిల్ ఫామ్ నర్సరీ వద్ద ధర్నా నిర్వహించి ఎండి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం నిర్వహించిన ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ పామాయిల్ రైతులకు జరిగే నష్టం పై ప్రభుత్వాన్ని నిలదీస్తానని, పామాయిల్ రైతుల కోసం ముందుండి పోరాడుతానని వారు హామీ ఇచ్చారు. పామాయిలు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ  మన రాష్ట్రములో పామాయిల్ వ్యవసాయం అభివృద్ధి చెందవలెననే ఆకాంక్షతో ఇప్పుడు ఉన్న జిల్లాలు కాకుండా అదనముగా 28జిల్లాలో పామాయిల్ వ్యవసాయం అభివృద్ధి కొరకు 480కోట్ల రూపాయిలు కేటాయించినారని,ఈ విషయంలో రైతులు అందరూ చాలా సంతోషంతో హర్షం ప్రకటించినారని,కానీ దీనికి విరుద్ధంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ వారు రైతులును నిరుత్సాహ పరుస్తున్నారని, పామాయిల్ రైతులకు ప్రతి నెలా ధర నిర్ణయించే పద్ధతిలో  ప్రతి నెలా 1వ తారీఖు నుండి నెలాఖరు వరకూ ప్రతి రోజూ అమ్మిన ధరను సరాసరి చేసి ఆ నెల ధరను నిర్ణయిస్తారని, ఇందులో రైతు వాటాగా 75.25శాతంను చెల్లిస్తారని, కానీ నవంబరు నెలలో 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు తక్కువ రేటుకు అమ్మినారని, 7వ తారీఖు నుండి నెల ఆఖరు వరకూ ఈ ఆయిల్ సంవత్సరములో అత్యధికమైన ధర రూ.92,000/-లు వచ్చిననూ ఆయిల్ ఫెడ్ వారు సి.పి.ఒ.ను అమ్మకుండా 1700టన్నులు నిల్వ ఉంచి,అమ్మకాలు జరుపలేదని. ఈ విదముగా

చేయుట వలన రైతులకు ఒక టన్నుకు రూ.800/-లు నష్టపోయినారని,డీజిల్, ట్రాక్టర్ డ్రైవర్ జీతాలు, స్పేర్ పార్ట్స్, గతములో కంటే చాలా రేటులు పెరిగాయని. అందువలన రవాణా చార్జీలును పెంచాలని, ఈ సంవత్సరం ఆంద్రా ఆయిల్ ఫెడ్ వారు గింజలలో రైతు వాటాగా 10.50శాతం ఇచ్చారని, మన రాష్ట్రములో గింజ శాతం ఎక్కువగా వచ్చుచున్నందున రైతు వాటాగా 11శాతంను ఇప్పించాలని వారు డిమాండ్ చేసారు.పామాయిల్ రైతులకు ఉద్యాన శాఖ వారు ఎరువులకు కూపన్లు ఇచ్చినా కానీ ఈరోజు వరకు ఆయిల్ ఫెడ్ వారు ఎరువులను ఇవ్వటం లేదని, విషయములన్నియూ పరిశీలించి తగు చర్యలు తీసుకొని పమాయిల్ రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి వెంకటేశ్వర రావు, ఆలపాటి రాము, కందిమల్ల కృష్ణారావు, బండి పుల్లారావు,అంకత ఉమామహేశ్వరరావు, కొక్కెర్లపాటి పుల్లయ్య, కె.వి.సత్యనారాయణ, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, జూపల్లి రమణ రావు, పొట్టా రాజులు, కాసాని వెంకటేశ్వరరావు, బిర్రం వెంకటేశ్వరరావు,రాజబాబు, నండ్రు రమేష్ బాబు, కేదార్నాథ్, తగరం జగన్నాథం పిట్టల అర్జున్ తదితర రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: