CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల పై ఫారెస్టు రెవెన్యూ శాఖ వల్ల ఇబ్బందులు:విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:


మన్యం టివి మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతంలోని అడవి బిడ్డలను అడవికి దూరం చేస్తూ వారి మనుగడకే ప్రమాదం కలిగేలా ఫారెస్టు, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు ఉన్నాయని ఇరు శాఖల సమన్వయ లోపం వల్ల గిరిజనులతో పాటు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.నియోజకవర్గంలోని వేల ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ శాఖ కబ్జా లో ఉందన్నారు.రైతుల చేతుల్లో పట్టా పాస్ పుస్తకాలు ఉంటున్నాయని భూములు మాత్రం ఫారెస్ట్ అధీనంలో ఉంటున్నాయి అన్నారు.నాటి ఏజెన్సీ చట్టాలను వక్రీకరిస్తూ రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు.గిరిజనుల్లో మనుగడకు భరోసా ఇచ్చేందుకు ఏజెన్సీ చట్టాలను తీసుకొచ్చారని చట్టాల్లో కొన్నిటిని సరళిస్తూ కొత్త చట్టాలను ప్రభుత్వం రూపొందిస్తున్నాయన్నారు.పోడు భూములకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నారన్నారు.పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపుతారని అప్పటివరకు ఏ ఒక్క ఆదివాసీలపై కేసులు పెట్టినా సహించేది లేదని ఇరు శాఖల అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.కొందరు అధికారులు అత్యుత్సాహం వల్ల పలు సమస్యలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గిరిజన గ్రామాల్లో అశాంతికి కారణమవుతున్నారు అని అన్నారు.సీఎం కేసీఆర్ పర్యటన తో శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం నరసింహారావు, పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు టిఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు, మణుగూరు ఎంపిటిసి ల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: