CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవి మాదే హక్కులు మావే అంటున్న ఆదివాసీ సంఘాలు.. ఏజెన్సీ చట్టాలను కాలరాస్తున్నారంటు ఆగ్రహం..

Share it:

 



మన్యం టీవీ : భద్రాద్రి కొత్తగూడెం,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) ఆధ్వర్యంలో ఇల్లందు మండలం లచ్చగూడెంలో సర్వే నెంబర్ 99 లో గల 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా 1/70  చట్టం, పేసా, చట్టాలకు విరుద్ధంగా అధికార పార్టీ , ..గరినేతరులు,.. మట్టి తోలి ఇటుక బట్టీలు చేయడం కోసం నిలువ చేసిన భూమిలో గల మట్టి లో... మొక్కలు నాటడం, ఆదివాసీ తుడుందెబ్బ జండాలు పాతటం జరిగినది. త్వరలో అట్టి భూమి లో ఇంటి  స్థలాలు ఏర్పాటు  చేసుకుంటామని అని తెలపటం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తి రాజు, కొడెం వెంకటేస్వర్లు, రాష్ట్ర నాయకులు కల్తీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి గోగ్గేల రామస్వామి, సుర్ణపక సత్యనారాయణ అడ్వాకేట్ , జిల్లా కార్యదర్శి చుంచు బుచ్చయ్య జిల్లా నాయకులు ఉండం కృష్ణ, తాటి పాపారావు , గుమ్మడి విజయ్, ముక్తి కృష్ణ, ముక్తి  రాజు , ఈసం సోమయ్య, ఎట్టి రమేష్, చుంచు వెంకన్న , తాటి కృష్ణ.కల్తీ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: