CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులే దేశానికి నిధి ....వారిని ఆదుకోవడం ప్రభుత్వాల విధి

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి


 వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

మన్యం టీవీ మంగపేట. 


రైతులే దేశానికి నిధి అని వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం మన ప్రభుత్వాల విధి అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో  ""వికాస్ అగ్రి ఫౌండేషన్"" ఆధ్వర్యంలో జరిగిన *జాతీయ రైతు దినోత్సవం* వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి  మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వాలు గట్టెక్కించకపోతే భవిష్యత్తు అధోగతే నని ఆవేదన వ్యక్తం చేశారు. ""రోజులు మారిన రాజులు మారిన మారనిది రైతు బతుకు"" అన్న నాటి మహాకవి శ్రీశ్రీ మాటలు నేటి రైతుల జీవన విధానానికి అద్దం పడుతున్నాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పథకాల ఫలాలు అందుకోని రైతులు ఉన్నారని అన్నారు. అట్టడుగున ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం సాకారం అవుతుందన్నారు. రైతులను ఓటు బ్యాంకు గా చూసే విధానం రాజకీయ పార్టీలు మానుకోవాలని హితవు పలికారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు మంచి మద్దతు ధర పొందేందుకు, బై బ్యాక్ పద్ధతిలో మిర్చి ఉత్పత్తి చేసేందుకు బహుళజాతి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే మన ప్రాంత మిర్చి రైతాంగానికి శుభవార్త వచ్చే అవకాశం వుందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని మన రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన మిర్చిని  పండిస్తున్నారని ఇలాంటి మిర్చికి అదనపు ధర కల్పించేందుకు ట్రేడర్లు, ఎగుమతిదారులకు అవసరమైన వసతులు కల్పించడం మరియు అనుమతులను కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భద్రాచలం, ఏటూరునాగారం ప్రాంతాల్లో మిర్చి బైబ్యాక్ మరియు ఆన్ లైన్ ట్రేడింగ్ విధానాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నామని అన్నారు. ఆర్గానిక్, ఐపీఎం పద్దతుల్లో పంటల సాగుకు రైతాంగం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. మిర్చి రైతుల కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టవలసి ఉండగా, కోవిడ్ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయని విచారం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని పంటలు పండించే రైతాంగానికి మంచి రోజులు రావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని సాంబశివ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం రైతులకు వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై పంపిణీ చేశారు. అనంతరం మాజీ భారత ప్రధాని, జాతీయ రైతు నాయకులు చరణ్ సింగ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన సేవలను కొనియాడారు. చరణ్ సింగ్ పుట్టిన రోజును జాతీయ ""రైతు దినోత్సవం"" గా జరుపుకోవడం రైతు లోకానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ షేక్ మదార్ సాహెబ్, వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి, తొండపు.శ్రీనివాసరెడ్డి ,చెట్టుపల్లి తిరుపతిరావు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: