CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వరాష్ట్ర సాధనకోసం పాటు పడిన ఉద్యమకారుడు తెరాస ముఖ్య నాయకుడుకి అస్వస్తత

Share it:


 స్వరాష్ట్ర సాధనకోసం పాటు పడిన  ఉద్యమకారుడు తెరాస ముఖ్య నాయకుడుకి  అస్వస్తత


తెలంగాణ కోసం తెరాస కోసం కష్టపడ్డ మా నాన్నను ప్రభుత్వమే ఆదుకోవాలి

మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలంలోని రాజుపేట గ్రామానికి కి చెందిన మలికంటి శంకర్ ఇతను తెలంగాణ శంకర్ గా ములుగు జిల్లా వాసులందరికి సుపరిచితుడు. తెరాస ఆవిర్భవించిన దగ్గరనుండి (2001)తెరాస ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి తెంగాణ శంకర్ గా పేరు గడించాడు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నాయకత్వం వహించి ఉద్యమానికి ఊపిరిలూదాడు. తెలంగాణ ఉద్యమకాలంలో తెరాస ములుగు జిల్లాలో, మంగపేట మండలంలో ఎటువంటి  ప్రభావం లేని రోజుల్లో ఇంటి ఇంటికి తిరిగి ఉద్యమ కాంక్ష రగిలించాడు, గ్రామ గ్రామానికి తెరాస జెండా ఎగిరేలా తాను శ్రమించాడు. అటువంటి తెలంగాణ శంకర్ ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో చికిత్స చేయించుకుంటున్నారు, ఈ విషయమై ప్రభుత్వం, తెరాస నాయకులు స్పందించి మా నాన్న మలికంటి శంకర్ ను ఏదైనా మంచి ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించి మాకు సహాయం చేయాలని మరల మా నాన్న తెలంగాణ శంకర్ లా తెరాస పార్టీ కోసం పని చేయాలని ఈ సందర్బంగా మలికంటి శంకర్ కుటుంబ సభ్యులు కొడుకులు మధు, రాజు మరియు మలికంటి శంకర్ భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: