CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్త పార్ల‌మెంట్ భ‌వనానికి ప్రధాని శంకుస్థాప‌న‌

Share it:


     

హైద‌రాబాద్‌:  కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఇవాళ శంకుస్థాప‌న చేశారు.  మ‌ధ్యాహ్నం 12.50 నిమిషాల‌కు శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. వేద పండితులు మంత్రాలు చ‌దివారు. భూమాత‌, కూర్మ‌, వ‌ర‌హారూప‌, న‌వ‌గ్ర‌హ‌, న‌వ‌ర‌త్న భ‌రిత శిల పూజ‌లు నిర్వ‌హించారు. న‌వ క‌ల‌శ స్థాప‌న త‌ర్వాత శంకుస్థాప‌న చేశారు. ప్ర‌ధాని మోదీ పేరిట పండితులు భూ పూజ‌లు నిర్వ‌హించారు.  971 కోట్ల ఖ‌ర్చుతో సెంట్ర‌ల్ విస్టా కొత్త పార్ల‌మెంట్ కార్యాల‌యాన్ని నిర్మించ‌నున్నారు.  2022, ఆగ‌స్టు 15 నాటికి ఇది పూర్తి కానున్న‌ది.  టాటా సంస్థ‌కు నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించారు.  ఇవాళ జ‌రిగిన భూమిపూజ‌, శంకుస్థాన కార్య‌క్ర‌మానికి ర‌త‌న్ టాటా హాజ‌ర‌య్యారు.  లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా బ‌హుళ మ‌త గురువుల‌తో ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఉన్న పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంకు నిర్మాణ ప‌నుల‌ను 1921లో ప్రారంభించారు. ఆరేళ్ల త‌ర్వాత‌.. 1927లో ఆ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యింది. అయితే సెంట్ర‌ల్ విస్టా భ‌వనాన్ని భార‌తీయ సంస్కృతి ప్ర‌తిబింబిచేలా నిర్మించ‌నున్నారు.  


సెంట్ర‌ల్ విస్టా ఇలా.. 


ఉభ‌య స‌భ‌ల ప‌బ్లిక్ గ్యాల‌రీల్లో 530 సీట్లు ఉండ‌నున్నాయి


1244 ఎంపీల‌కు అనువైన రీతిలో సీట్ల‌ను కేటాయించ‌నున్నారు


రాజ్య‌స‌భ‌లో 348 ఎంపీల‌కు సీటింగ్‌


లోక్‌స‌భ‌లో 888 ఎంపీల‌కు సీటింగ్‌


64,500 మీట‌ర్ల విస్తీర్ణంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం

Share it:

TELANGANA

Post A Comment: