CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ మిర్చి రైతులకు చేయూతను అందించండి

Share it:


 తెలంగాణ మిర్చి రైతులకు చేయూతను అందించండి

*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జి.వి.యల్ కోరిన సాంబశివ రెడ్డి

*మిర్చి రైతులకు పలు రాయితీలు పథకాలు మంజూరు చేయండి

*వరంగల్ లో మిర్చి ల్యాబ్ ను మంజూరు చేయాలని వినతి


మన్యం టీవీ ఏటూరునాగారం:

తెలంగాణ మిర్చి రైతులకు చేయూతనిచ్చి ఆదుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ మరియు ఎంపీ జి.వి. యల్ నర్సింహారావుని మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి  కోరారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జి.వి.యల్ నర్సింహారావు మిర్చి సాగులో సమస్యలు తెలుసుకునేందుకు తొలిసారి గా తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ వచ్చారు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల అవసరాలకు సరిపడా శీతల గిడ్డంగులు వేర్ హౌస్ గోదాములు మంజూరు. చెయ్యడంతో పాటు ఐ.పి.యం ఆర్గానిక్ ఫార్మింగ్ పథకాలకు, నిధులు మంజూరు చేయాలని సేంద్రియ  సేద్యాన్ని, కొనసాగించేందుకు కృషి పరంపరాగత్ యోజన పథకాన్ని అమలు చేయాలని, మిర్చి లో నాణ్యత ప్రమాణాలు వృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు  ఈ స్పేస్ బజార్ పథకానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక మిర్చి వంగడం చపటాకు జి.ఐ గుర్తింపు నివ్వాలని ,మిర్చి సాగు లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రైతులను గుర్తించి పురస్కారాలు, అవార్డులు అందజేయాలని అన్నారు. అంతేకాకుండా పంట కోత అనంతరం యజమాన్య పద్ధతుల్లో భాగంగా మిర్చి రైతులకు టార్పలిన్లు,సీల్పాలిన్లు రాయితీల పై మంజూరు చేయాలని రైతు ఉత్పత్తి సంఘాలకు చేయూతనివ్వాలని సాంబశివ రెడ్డి సి.టి.యఫ్.సి చైర్మన్ జి.వి.యల్ నరసింహారావుకు లేఖ అందజేశారు. సమస్యలు విన్న జి.వి.యల్ మిర్చి రైతుల సమస్యల పరిష్కరించే దిశగా వివిధ పథకాల ద్వారా రైతులను ఆదుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు సాంబశివ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో  స్పైసెస్ బోర్డు ఆంధ్ర ప్రదేశ్ డి.డి మోహన్ రావు, వరంగల్ డి.డి డాక్టర్ గాది లింగప్ప, స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ విక్రమ్, డైరెక్టర్ అంజి రెడ్డి, ఉన్నత అధికారులు, ఉత్పత్తిదారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ట్రేడర్లు, ఎక్స్ పోర్టర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: