CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టైగర్ జోన్ ల కొరకే పెంపుడు పులులను అడవుల్లో వదిలిన అధికారులు

Share it:



వెంకటాపురం(నూగూరు)


* పులులకు ఆహారంగా మారుతున్న ఆదివాసీలు

* పెంపుడు పులులను అడవిలో వదిలేసిన అటవీశాఖ అధికారులు

 * అడవి జంతువులకు ఉన్న రక్షణ ఆదివాసీలకు లేదు


బుధవారం నాడు ఆదివాసి నవ నిర్మాణ సేన మండల అధ్యక్షుడు పోల బోయిన భార్గవ్ అధ్యక్షతన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో సమావేశం ఎయన్ యస్ రాష్ట్ర అధ్యక్షులు పూనేం సాయి మాట్లాడుతూ ఉన్నట్టుండి  రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతంలో పులులు ఎలా వచ్చాయని అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు .ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రికి రాత్రే  పెంపుడు పులులను దీంచి వాటికి ఆహారంగా ఆదివాసులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో అడవిలోని క్రూర మృగాల ఉన్న రక్షణ ఆదివాసులకు లేదు గత కొంత కాలంగా పశువుల కాపరులను పంట చేను, పొలాలకు వెళ్లే వారిని అత్యంత క్రూరంగా వేటాడి చంపాయి అన్నారు. ఆఫీస బాద్ జిల్లాలో ఆదివాసి యువతిపై దాడి చేసి చంపింది అలాగే ఫిడాం విగ్నేష్ అనే ఆదివాసి యువకుడిని చంపింది. ఈ చర్యలన్నీ టికీ ప్రభుత్వ బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషన్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఏటూర్ నాగారం అటవీ ప్రాంతంలో కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో దమ్మపేట ప్రాంతాల్లో పులుల జడలను గుర్తించారని అన్నారు. ఇదంతా ఆదివాసీలను అడవుల నుండి దూరం చేయాలనే ప్రయత్నంలో భాగం టైగర్ జోన్ లు గా ఏర్పాటు చేసి  ఆదివాసులు శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్న పని అన్నారు. ప్రాంతంలో లో ఏ అభివృద్ధి పనులు మైనింగ్ పనులు జరిగినా ముందుగా  బలి అయ్యేది ఆదివాసులే చివరికి క్రూర మృగాల చేత కూడా ఆదివాసీలపై దాడులు చూపిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించారు. జాతీయ అటవీ శాఖ 2012లో జరిపిన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు అసలు లేవని నివేదిక సమర్పించారు అలాంటిది ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు పులులు రావడాన్ని గల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో  ఆదివాసులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని అన్నారు వెంటనే కృత్రిమ పుల్లలను వాటి దాడి నుండి ఆదివాసులను రక్షించాలని అన్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో కృష్ణ ప్రసాద్ ,రోహిత్ ,పోతురాజు భవాని ,రాణి ,గోపి పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: