CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలగ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు కావు

Share it:


మన్యం టీవీ మంగపేట

మంగపేట మండలం నుండి  సుమారుగా ఐదు వందలమందిప్రజలు వెళ్లి  ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు మంగపేట మండలం లోని  23 రెవిన్యూ గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా లేదా ఏజెన్సీ ప్రాంతాలు కావని  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంగపేట మండల గిరిజనేతర రైతులు,  మరియు ప్రజలు, ఈ సందర్బంగా కలెక్టర్ తో మంగపేట మండలం షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి రాదు,  మండలం లో 23 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి ఇవి  స్వాతంత్ర్యానికి పూర్వం  నిజాంల పరిపాలనలో పాల్వంచ సంస్థానం లో ఉండేవి  అనంతరం వీటినివరంగల్ జిల్లా ములుగు తాలూకాలో కలపడం జరిగింది, ములుగుగ్రామాలు ప్రకటించిన  ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పటికీ తర్వాత కలిపిన గ్రామాలు  షెడ్యూల్డ్ లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో మంగపేట మండల 23రెవిన్యూ గ్రామాల పేర్లు లేకపోవడం గమనించదగ్గ విషయం. 

ఈ విషయం సాక్షత్తూ కోయబ్రహ్మానందం అండ్ అదర్స్ 1973 కేసులో మంగపేట మండలంలోని  23 రెవిన్యూ గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా కాదని, లేదా ఏజెన్సీ ప్రాంతం కాదని నిరూపితమైంది. కోయబ్రహ్మానందం 1973 కేసు లో మంగపేట మండలం లోని గ్రామాలు ఏజెన్సీ గ్రామాల పేర్ల లో లేవు కావున ఇది షెడ్యూల్డ్ ప్రాంతం కాదని ఇచట నాన్ ఏజెన్సీ ప్రాంతం లాగానే ఎన్నికలు, క్రయ విక్రయలు జరిపిన విషయం విదితమే. 

ఈ విషయంపై ములుగు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ద్వారా పై విషయాలు మా మంగపేట మండలం ఒకప్పుడు నిజాం పరిపాలన లో పాల్వంచ సంస్థానంలో నుండి విడదీసి 6 గ్రామాలను (ప్రస్తుతం ఉన్న 23 రెవిన్యూ గ్రామాలు ) ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు తాలూకా లో కలిపినందున వీటినిషెడ్యూల్డ్ లేదా ఏజెన్సీ ప్రాంతం క్రిందకు రాదని 1973 కోయ బ్రహ్మానందం కేసులో పూర్తిగా తెలపడం జరిగింది, అయినా కొంతమంది గిరిజనులు  2006 కోర్ట్ ను ఆశ్రయించటం స్టే తీసుక రావడం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే తంతు జరగడం  తద్వారా మంగపేట మండలంలోని 23 రెవిన్యూ గ్రామాలు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ సమస్యల్లో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. 

మా ప్రాంతం అధికారికంగా ఏజెన్సీ ప్రాంతం కాదు ఒకవేళ అలా చేయడానికి ఆర్టికల్ 14ప్రకారం, ఆర్టికల్ 21ప్రకారం  చట్టవిరుద్ధం కాబట్టి ఈ ప్రాంతాన్నికోర్ట్ తీర్పు వచ్చేవరకు  నాన్ ఏజెన్సీ ప్రాంతం గా గుర్తించి పరిపాలన స్తంభించకుండా అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగించ వలసినదిగా  వినతి పత్రం ఇచ్చి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ను  కోరడమైనది.

Share it:

TELANGANA

Post A Comment: