CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడ్డగుట్ట అభివృద్దిపై రేగాకాంతారావు డాక్యుమెంట్‌

Share it:

 

  • అడ్డగుట్ట అభివృద్దిపై రేగాకాంతారావు డాక్యుమెంట్‌
  • బస్తీల వారీగా సమస్యలపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు నివేదిక
  • మంచిరోజులొచ్చాయ్‌

..............

హైదరాబాద్‌:

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో అడ్డగుట్ట 142వ డివిజన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రభుత్వవిప్‌ రేగా కాంతారావు అక్కడి సమస్యలపై పూర్తి అధ్యయనం చేయడంతో పాటు సమస్యలపై పూర్తి నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి, మునిసిపల్‌ శాఖా మంత్రి కేటీరామారావు దృష్టికి తీసుకెళ్ళారు. అడ్డగుట్ట ఇన్‌ఛార్జిగా ప్రతి గల్లిగల్లిd తిరిగి ప్రజలను చైతన్యపరచడంతో పాటు అక్కడి ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమే వాటిని తీర్చగలదని భరోసా నిచ్చారు. అడ్డగుట్ట అభివృద్దిపై డెవలప్‌మెంట్‌ డాక్యుమెంట్‌ తయారుచేయించారు. రేగా విజన్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్‌ ఎన్నికల అనంతరం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధాన సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేద్దామని హామీనిచ్చారు.


రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు, అడ్డగుట్ట అభివృద్దికి రూపొందించిన డెవలప్‌మెంట్‌ డాక్యుమెంట్‌ ఈ విధంగా ఉన్నాయి.

1. అడ్డగుట్టలో ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్‌, డ్రైనేజీ, వ్యవస్థ, టెంపుల్‌ స్థలం వివాదం, డబుల్‌ బెడ్‌రూమ్‌, మంచినీటి సమస్యలకు పరిష్కారం అడిగారు.

2. ఏ, బీ, సీ, డీ సెక్షన్‌లో లోయర్‌నగర్‌లలో మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు. విద్యుత్‌ స్తంభాలు అన్నీ ఇనుప స్తంభాలు కరెంట్‌ షాక్‌ వస్తుంది అని, ఇండ్ల మీద నుండి వైర్లు ఉన్నాయి. అన్నీ మార్చాలని, డబుల్‌ బెడ్‌రూమ్‌ కావాలని, వరద సహాయం అందలేదని, కొన్ని కులాలకు యాదవ, గొల్ల, పద్మశాలి కమ్యూనిటీ హాల్స్‌ కావాలని, నిరుపేద మహిళలకు, యువతకు చేతివృత్తులు చేర్చుకొనుటకు వివిధ రకాల కోర్సులు ట్రైనింగ్‌ సెంటర్‌ ,స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

3. శాస్త్రినగర్‌, వెంకట్‌నగర్‌, ఇందిరలక్ష్మీనగర్‌, సాయినగర్‌లలో ఉన్న పెండింగ్‌ రహదారి పూర్తిచేయాలని, డ్రైనేజీ, విద్యుత్‌ స్తంభాలు ఇనుపవి మార్చాలని, కమ్యూనిటీ హాల్‌ మార్చాలని, మహ్మదీయ మజీద్‌ వాళ్ళకు ఖబరస్థాన్‌ కావాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, 50 పడకల దవాఖాన లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చాలని, గ్రంధాలయం, బస్టాండ్‌ లేక ప్రజలు పడే ఇబ్బందులు తొలగించాలని, విద్యుద్దీపాల సమస్య, వరదసాయం అందని వారి సమస్య, కుల దేవతలు కొలుచుకొనుటకు గుళ్ల నిర్మాణాలు చేయాలని కోరారు.

4. తుకారాంగేట్‌, వడ్డెరబస్తీ, గంగపుత్ర బస్తీ, అంబేద్కర్‌నగర్‌, శాంతినగర్‌, బడే మజీద్‌, లాలాపేట్‌ వాసులు కోరిన విద్యుత్‌ స్తంభాలు ఇనుపవి మార్చాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, 10వేల వరదసాయం ఇవ్వాలని, ఒక మజీద్‌లో మదర్సా, కూలిన ప్రహరీ గోడ నిర్మాణం, ఖబర్థాన్‌ సమస్య, క్రిస్టియన్‌ చర్చిలలో పాస్టర్స్‌కు డబుల్‌ బెడ్‌రూమ్‌ కావాలని, నిరుపేద మహిళలకు, యువతకు చేతివృత్తులు నేర్చుకొనుటకు వివిధ రకాల ట్రైనింగ్‌ సెటర్స్‌ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌) ఏర్పాటు చేయాలని కోరారు.

5. అభివృద్దికి సంబంధించి రేగా అందజేసిన డెవలప్‌మెంట్‌ డాక్యుమెంట్‌పై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించడంతో పాటు అన్ని సమస్యలు పరిష్కారం చేద్దామని, టీఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదని హామీనిచ్చారు.

6. ఇంకా అడ్డగుట్ట డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం, పార్టీలో సమన్వయం లోపించి కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులు, నూతన నాయకత్వం ఎదుగుదలకు ఆటంకాలు, ముఠా రాజకీయ వలసలపై కూడా సమగ్రనివేదిక అందజేసినట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అడ్డగుట్ట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి కూడా సర్జరీ చేయాలన్న నిర్ణయానికి పార్టీ వచ్చినట్లు తెలిసింది. నేరుగా అధినేతల దృష్టికే ప్రభుత్వ విప్‌ కాంతారావు వాస్తవ స్థితిని తీసుకెళ్ళడం, వారే హామీనివ్వడంతో అడ్డగుట్టకు మంచిరోజులొచ్చినట్లే.

.............................

Share it:

TELANGANA

Post A Comment: