CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు సానుభూతి పరుల అరెస్ట్ ఏ ఎస్పీ శబరీష్

Share it:


*మావోయిస్టు నాయకులైన హరి భూషణ్, చంద్రన్న, ఆజాద్, దామోదర్,లచ్చన్న జనజీవన స్రవంతిలో కలవాలి

*విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఏఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్

మన్యం టీవి,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట వద్ద మావోయిస్టు సానుభూతి పరుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మందుపాతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు  ఏఎస్పీ శబరీష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

నమ్మదగిన సమాచారం మేరకు అశ్వాపురం పోలీసు వారి సిబ్బందితో కలిసి మొండికుంట లో గల అటవీ ప్రాంతాల్లో తనిఖీ చేస్తుండగా పోలీస్ లకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా హేమల జోగ, తండ్రి సంగా,అడ్రెస్ పెద్దబోడికెల్ గ్రామం,చింతలనార్ తానా,సుకుమా జిల్లా ఛత్తీస్గఢ్రాష్ట్రం వారిని పట్టుకుని విచారించగా సుమారు ఏడూ సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్ట్ పార్టీ,పెద్దబొడికెల్ మిలీషియా కమాండర్ గా పని చేస్తున్నాను అని విచారణ లో తెలిపినట్లు ఎఎస్పీ శబరీష్ తెలిపారు.అదే క్రమంలో పోలీసులను చంపటానికి మరియు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడానికి పేలుడు పదార్థాలు తీసుకొని వెళుతుండగా అశ్వాపురం పోలీస్ వారు పట్టుకున్నారు అని వారి వద్దనుండి 

5 జిలెటిన్ స్టిక్స్,

100 మీటర్ల వైర్,

1 టిఫిన్ బాక్స్,

2 డిటోనేటర్

2 9 ఓల్ట్స్ గల బ్యాటరీలను స్వాధీనపరచుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు పూర్తిగా అమాయకులైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర గిరిజనులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమాయకులైన కోయ గిరిజను లను ఉపయోగించుకుంటూ వారితో నిత్యవసర వస్తువులు,మెడిసిన్ పేలుడు పదార్థాలు,మొదలైన వస్తువులు తేప్పించుకుంటూ  వారిని పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక పనులకు వినియోగించుకుంటున్నారు.కాబట్టి ఇలాంటి అమాయక గిరిజనులు వారి సొంత ప్రయోజనాల కొరకు వాడుకోవటం తగదన్నారు. మావోయిస్టులకు సహకరించిన వారి యొక్క వివరాలు పూర్తిగా పోలీసులు వద్ద ఉన్నవి అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. మావోయిస్టులకు ఎవరు సహకరించ వద్దని మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు చంద్రన్న,హరి భూషణ్,ఆజాద్ మరియు దామోదర్ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారస్థులు, కాంట్రాక్టర్లను లెటర్ లతో బెదిరిస్తున్న విషయాలు మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి.ఈ మావోయిస్టు నాయకులు గతించిన సిద్ధాంతాలతో వారి పార్టీ ఉనికిని చాటుకోవడానికి అమాయక గిరిజన ప్రజలు ఇన్ఫార్మర్ల నెపంతో అన్యాయంగా చంపుతూ పబ్బం గడుపుకుంటున్నారు.కావున వారి తుప్పుపట్టిన సిద్ధాంతాలను వదిలిపెట్టి జన జీవన స్రవంతిలో కలవాలని కోరుచున్నాము. మావోయిస్టు పార్టీ రోజురోజుకూ క్షీణిస్తూ తమ ఉనికిని కోల్పోతుంది. ఈ ప్రాంతంలో దళాల కదలికలు ప్రజల ద్వారా మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూన్నవి.కావున మావోయిస్టు నాయకులైన హరి భూషణ్, చంద్రన్న, ఆజాద్, దామోదర్,లచ్చన్న జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: