CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిటీలో పేదలకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తాం - పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు

Share it:

 

• దశాబ్దాలుగా పరిష్కారనికి నోచుకోని అనేక కాలనీల్లో రెవెన్యూ మరియు భూ సంబంధిత సమస్యలను, ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్

• ఉప్పల్ లో నియోజకవర్గంలో సుమారు 20 కాలనీల్లోని సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కి కలిసి ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు 


ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న రెవెన్యూ సమస్యలు తొలగించిన ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ఆయా కాలనీ వాసులు ప్రగతి భవన్ తరలివచ్చి, మంత్రి కె తారక రామారావు కు ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గానికి సుమారు 20 కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 


• కెసిఆర్ నగర్ లాంటి కాలనీలను డి నోటిఫికేషన్ చేయడం ద్వారా ఆయా కాలనీల్లో నీ ప్రజలందరికీ ఉపయుక్తం గా మారింది...నగర్లోని ఇతర కాలనీలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉన్నది. 


• హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుంది. 


• ధరణి కార్యక్రమం ద్వారా నగరములో ఉన్న ప్రతి ఒక్క ఇంచ్ భూమికి సంబంధించిన వివరాలు వాటికనుగుణంగా యాజమాన్య హక్కులను పొందే వీలు కలుగుతుంది

• ధరణి ద్వారా భూ యాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుంది. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు అవినీతి రహితంగా వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. 

• ఈ ప్రభుత్వం ఒక్కో అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని ప్రారంభంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. అందుకే గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, మంచినీటి సరఫరా వంటి మొదలైన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నము

• చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కన్నా ఎక్కువగా ఇంకెవరికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంటుంది

• తెలంగాణ రాష్ట్ర మరియు హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కెసిఆర్ గారి తోనే సాధ్యం అవుతుంది

• రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలన్న ఆలోచన కలిగిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

• అందుకే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఈ పథకం ఈ చట్టం తీసుకు వచ్చిన పేద ప్రజలకు కచ్చితంగా మేలు కలిగేలా ఆలోచించి చర్యలు తీసుకుంటారు. ఇదే కోవలో నూతన పంచాయతీ రాజ్ మునిసిపల్, నూతన రెవెన్యూ చట్టాలను తీసుకు రావడం జరిగింది. 

• పేదవాడికి స్థిరాస్తి పైన యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా నగరంలోని బస్తీలు, కాలనీలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేస్తాం

• ఇప్పటికే ఈ దిశగా ఎల్బీనగర్, ఉప్ప ల్ , కుత్బుల్లాపూర్, వంటి కూకట్ పల్లి వంటి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా కృషి చేస్తున్నది

• పేదవాడికి భూ యాజమాన్య హక్కులు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి అదనపు భారం మోపాలన్న ఆలోచన లేదు.

• ప్రజలకు ఊరట కల్పించాలన్న లక్ష్యంతో తప్ప ఇతర ఆలోచన మాకు లేదు

• రెవెన్యూ సమస్యలను పరిష్కరించిన తర్వాత అంతటితో ఆగిపోకుండా ఆయా కాలనీల్లో ప్రజలకు అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులు సౌకర్యాలు కల్పన పైన కూడా దృష్టి సారిస్తాము

• పేద మధ్యతరగతి వర్గాలకు అండగా నిలబడాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది

• ఒకవైపు భూములు, ఇళ్లలో నివాసం ఉంటున్న వారి సమస్యలు పరిష్కరిస్తము. దాంతో పాటు హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలాలు లేని వారి కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న ది.

• ఈ డబుల్ బెడ్రూం ఇలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకత విధానంతో అర్హులైన వారికి అందించేలా కార్యక్రమాలు చేపడతాం. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము

• ఉప్పల్ రామంతపూర్ భగాయత్ కాలనీ తోపాటు చర్లపల్లి ప్రాంతంలోని నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్,  శ్రీ మహాలక్ష్మి నగర్ బి.యన్ రెడ్డి నగర్, గాంధీనగర్, న్యూ రైల్వే కాలనీ, ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీ ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. పైన తెలిపిన కాలనీల్లో ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన డీ నోటిఫికేషన్ తో పాటు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ వంటి ఈ మార్గాల ద్వారా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారాలను చూపడం జరిగింది. 


• ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: