CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుట్టిన భూమి మీద హక్కుకై ఒక్క రోజు దీక్ష ఏజెన్సీ దళితుల సేవా సంఘం

Share it:



మన్యం టీవీ మంగపేట 

ఏజెన్సీ దళితుడా ఇకనైనా మేలుకో పుట్టిన భూమి మీద హక్కు కొరకై  స్వతంత్రానికి పూర్వం నుండే మనం ఈ ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నామా?లేదా? అని నిర్దారణకై ఏజెన్సీ గ్రామ సభలలో నిలదిద్దాం  అంటు  ఏజెన్సీ దళితుల సేవా సంఘం (ఏడిఎస్ఎస్) ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో ఒక్క రోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఒక్క రోజు నిరాహారదీక్షకు పలు సంఘాలు నాయకులు మద్దతు పలికారు అనంతరం వారు మాట్లాడుతూ ఏజెన్సీ దళితులు గిరిజనేతరులు కాదు షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులను గుర్తించాలి అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా ఏజెన్సీలో దళితులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఏజెన్సీ దళితులకు ఐటీడీఏలో ఉన్న 5% రిజర్వేషన్ అమలు చేయాలని ఏజెన్సీలో ఉన్న దళితులకు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలనిఏజెన్సీ దళిత విద్యార్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్న 15% రిజర్వేషన్ ఏజెన్సీ గ్రామాల్లో అమలు చేయాలని జీఓ నెం 3 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని అన్నారు.ఏజెన్సీ ప్రాంత మూల వాసులైన ఆదివాసుల వాంగ్మూలంతోనే  మనం ఏజెన్సీలో జీవిస్తున్న  దళిత ప్రజలమని నిరూపించుకుందాం అని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు పిలుపునిచ్చారు. ఈ ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీను, గాజా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: