CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా ప్రభావం విద్యార్థుల చదువుకు శాపం.. "బడికి దూరమవుతున్న బడిఈడు పిల్లలు"...

Share it:


 కరోనా ప్రభావం విద్యార్థుల చదువుకు శాపం.. 

ఆన్ లైన్ తరగతులు అంతంత మాత్రం.. !

"బడికి దూరమవుతున్న బడిఈడు పిల్లలు"...



మన్యం టీవీ : జూలూరుపాడు,

"కరోనా వైరస్ మహమ్మారి" విద్యార్థుల చదువుల పై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా నిబంధనలు, అమలులో ఉండటం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ ఏడాది బడి తలుపులు తెరుచుకోలేదు. పాఠశాలల్లో చదువుకోవలసిన పిల్లలు ఇంటి గడప దాటేందుకు కుదరలేదు. విద్యార్థుల చదువు పట్ల ఆలోచన చేసిన ప్రభుత్వం "ఆన్ లైన్" తరగతులు ప్రారంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలో చదువుకొని, ఆటలు ఆడి, ఇంటికి వచ్చి హోం వర్క్ చేసుకునేవారు. ఇందుకు భిన్నంగా సాగుతున్న ఆన్ లైన్ తరగతులు వారికి కొంత ఇబ్బందిగా మారింది. చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు వీక్షించేందుకు తగిన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. బాల్యంలోనే అక్షరాలు నేర్పి పదును పెట్టాల్సిన వయసులో అవాంతరం ఏర్పడడం, కొంత నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. పల్లెల్లో పలుచోట్ల పిల్లలు తమ పంట పొలాల్లోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ గడుపుతుండటం గమనార్హం.

Share it:

TELANGANA

Post A Comment: