CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం వీరుడు కొమురం భీమ్ 80 వ వర్ధంతి సభ

Share it:


మన్యం టీవీ,కొత్తగూడెం:


(నవంబర్ 8) కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలో కొమురం భీమ్ 80వ వర్ధంతి సభను తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప.కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ సోయం.బాబురావు పాల్గొన్నారు. సోయం.బాబురావు మాట్లాడుతూ మన్యం వాసులు ఈ సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే కొమరం భీం దాదా చేసిన పోరాటం వల్లనే అని, కొమరం భీమ్ పోరాట ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ ప్రతి గిరిజనుడు మరవకూడదు అన్నారు. ఆదివాసీ గూడెలలో కొమరం భీమ్ విగ్రహాలు నెలకొల్పాలి, ప్రతి గిరిజన కుటుంబంలో కొమరం భీమ్ చిత్ర పటాన్ని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ లో గిరిజనుల పోడు వ్యవసాయం కు అధికారులతో ఎటువంటి సమస్యలు లేకుండా చేశామని, ఇక్కడ ఎదురవుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని కితాబిచ్చారు. ఏజెన్సీ చట్టాలైనా 1/70,5 వ షెడ్యూల్ చట్టాలకు అధికారుల నిర్లక్ష్యం వలన తూట్లు పడుతున్నాయని, గిరిజనేతరులకు పట్టాలు వస్తున్నాయని అన్నారు. అదిలాబాద్ లో చేపట్టిన ఉద్యమం వల్లనే ఏజెన్సీలో ఎల్.ఆర్.ఎస్ నిలుపుదల జరిగిందన్నారు. ఏజెన్సీ లో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని 1980 సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన జీవో నెంబర్ 3 ను కొట్టివేయడం రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అని అన్నారు. మన హక్కులు, చట్టాలు కాపాడుకునేందుకు పోరాటాలు,ఉద్యమాలు చేయాలని ఉద్యమాలు వలనే గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని మరి ఏ విధంగా లబ్ధి చేకూరదున్నారు. కొంతమంది లంబాడీలకు దాసోహం చేస్తూ తన మీద తప్పుడ, అసత్య దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆదివాసీల మనుగడ కోసం నేను ముందడుగు వేశానని, ఆదివాసీల కోసం చావడానికైనా సిద్ధమే అన్నారు. భద్రాచలం ఎక్స్ ఎమ్మెల్యే కుంజా.సత్యవతి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్, సాదాబైనామా లో ఉన్న లోపాల వలన మన గిరిజన భూములకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఏ.ఈ.డబ్ల్యూ.సి.ఏ జిల్లా అధ్యక్షులు పెండ్లకట్ల.కృష్ణయ్య ప్రసంగిస్తూ ఆదివాసుల ప్రధాన జీవనాధారమైన పోడు వ్యవసాయం భూమి కి సరైన హక్కు పత్రాలు లేవని ఎన్నో ఏళ్లుగా సేద్యం చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు లాంటి పథకాలకు నోచుకోలేక పోతున్నారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు దాదా తీసుకెళ్లి గిరిజనుల యొక్క ఇటువంటి ముఖ్య సమస్య కోసం కృషి చేయగలరని విన్నవించుకున్నారు. కొమరం భీమ్ వర్ధంతి సభకు తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడెం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎట్టి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గొగ్గెల.రామస్వామి, గౌరవ అధ్యక్షులు కొమరం.బుచ్చయ్య, ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు.రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త వర్షా.లక్ష్మణ్,ఏ.ఈ.డబ్ల్యూ.సి.ఏ జిల్లా ఉపాధ్యక్షులు జజ్జర.లింగేశ్వరరావు, గుమ్మడి.నర్సయ్య ఎక్స్ ఎమ్మెల్యే ఇల్లందు, పొడియం.బాలరాజు ఏ.ఈ.డబ్ల్యూ.సి.ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ముక్తి.రాజు తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి, దారబోయిన.రమేష్ తుడుందెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి,సోయం.సత్యనారాయణ తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షులు మరియు ఆదివాసీ సంఘాల ముఖ్య నాయకులు,ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: