CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెప్రకృతి వనాల పేరిట దళితుల ఇనాం భూములు లాక్కోవద్దు..

Share it:

 


*పల్లెప్రకృతి వనాల పేరిట దళితుల ఇనాం భూములు లాక్కోవద్దు.. 

అభివృద్ధి పేరిట జరిగే ఈ విధ్వంసం ఆపండి..* TMM ములుగు జిల్లా అధ్యక్షులు కర్రి శ్యాంబాబు.  

మన్యం టీవీ మంగపేట. 

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు పేరిట  దళితుల ఇనాం భూములు లాక్కొని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది పేద దళితుల కడుపుకొట్టడమే, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి లేని దళితులకు ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీఇచ్చారు, కానీ అధికారులు ఉన్న మా భూమిని లాక్కొని అభివృద్ధి పథకాలపేరిట పల్లె ప్రకృతి వనాలు మరియు ఇతర కట్టడాలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ విధ్వంసం ములుగు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఇదేమి అన్యాయం అని ములుగు జిల్లా లోని పప్కాపూర్లో తహసీల్దార్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి అడగ్గా ఎక్కడ మా ప్రభుత్వరెవిన్యూ  భూమి ఉంటే అక్కడ నిర్మిస్తాము అని సమాధానం ఇచ్చారు, మంగపేట మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ లోఏకంగా స్మశానం ఆక్రమించి అక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా  గ్రామ సభమొత్తం సభ్యులువద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అయినా అక్కడపల్లె ప్రకృతి వనం పేరిట విధ్వంసం జరుగుతూనే ఉంది.  ములుగు జిల్లా మొత్తం దళిత పేదల భూములు లాక్కొని రెవిన్యూ భూమి అని అక్కడ ఏదో ఒక నిర్మాణం చేస్తున్నారు. దీని వలన దళిత ప్రజలు ఇంకా నష్ట పోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇటువంటి చర్యలు మాని దళితుల భూములు వెనక్కి ఇవ్వాలని ములుగు జిల్లా తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: