CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

ప్రతీ గిరిజనుడికిపట్టాభూమిఇవ్వాలి మన్యసీమ పరిరక్షణ సమితి (డోలు దెబ్బ)

Share it:


మన్యం టీవీ మంగపేట. 

1950నుండి ఏజెన్సీ ప్రాంతంలో 9 తెగలగిరిజనులు కోయ, నాయక్ పోడ్, చెంచు, అటవీ తెగల గిరిజనులకు, 1959 1/59  1970 1/70 చట్టాల ప్రకారం ప్రతీ గిరిజనుడికి 15ఎకరాల పట్టాభూమిని  ఇవ్వాలని చట్టాలు స్పష్టంగా చెపుతున్నాయి అని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ నాయకులు అన్నారు. ROFR చట్టం ప్రకారం పది ఎకరాలు పట్టాభూమి ఇవ్వాలని 2006 చట్టం చెపుతుంది, 1865లో వచ్చిన చట్టం ఆధారంగా 1927చట్టం వచ్చిందని ఆ చట్టంలో చేసిన శాసనం ప్రకారం అడవులను రిజర్వడ్ ఫారెస్ట్ గా విభజించారు (RF). సంప్రదాయ హక్కుల స్థానంలో ప్రజలకు వెసులుబాటు కల్పించారు, దీనినే కన్వేషన్ అంటారని, మూడోరకంగా గ్రామ అడవులను VF గుర్తించారు. 

దీని ప్రకారం మొత్తం గిరిజనులకు 25 ఎకరాల భూమిని పట్టా చేసి తహసీల్దార్ గిరిజనుల ఇంటికి వెళ్లి ఇవ్వాలని అన్నారు. మంగపేట రెవెన్యూ పరిధిలో 23గ్రామాల్లో ఉన్న75 వేల ఎకరాల భూమిని గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు పట్టా ఇవ్వడం జరిగింది దీనికి గల కారణం గిరిజనులు లంచం ఇవ్వలేరు, అందువలన ఇతరులకు పట్టాచేసి ఇచ్చారు అటువంటి భూమి పట్టాలను 1/70చట్టం ప్రకారం చెల్లవు కాబట్టి వెంటనే వాటిని రద్దు చేసి గిరిజనులకు పట్టాలు ఇవ్వవలసినదిగా మన్య సీమ పరిరక్షణ సమితినాయకులు  డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య,  జిల్లా కమిటీ సభ్యులు, సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, తుడుందెబ్బ మండలం అధ్యక్షులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

Post A Comment: