CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ పిల్లలు - "ఆన్లైన్ క్లాసులు"

Share it:

మన్యం టీవి : కరోనా మహమ్మారి వల్లన.. పూర్తి విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడంతో పాటు నేరుగా పాఠాలు చెప్పే పరిస్థితి లేక పోవడం వల్లన ఇటీవల ఆన్లైన్ పద్దతులలో బోధించడం జరుగుతుంది. దిని ద్వారా ఒక వైపు నుంచి పూర్తి విద్యా వ్యవస్థ కు దూరమైన విద్యార్థులనూ ఒక క్రమంలో అధునాతమైన సాంకేతిక పద్దతులలో బోధించడం జరుగుతుంది. కాని మరో వైపు.. అసలే అభివృద్ధికి అడమ దూరంలో వున్న ఆదివాసీ గుడాలలో.. ఆన్లైన్ విక్షణం ద్వారా వినడం తమ వల్ల కావడం లేదంటూ , కొత్తగా వున్నదని, ఆదివాసీ పిల్లలు, వారి తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే పనులు లేక వరదల వల్లన ఇబ్బందులు పడుతున్న సమయంలో.. తమ పిల్లలకు చదువుకోవాలని ఆసక్తి వున్న అందించలేకపోతున్నాం అని దీనంగా చెబుతున్నారు. ఎన్నికల వేళ హామీలు గుప్పించే నాయకులు.. భవిష్యత్ కలిగిన భావి భారత పౌరులుగా మారే, ఆదివాసీ విద్యార్థుల పట్ల అంకితభావంతో విరాళంగా టీవీలు, విద్యార్థులకు ఉపయోగపడేలా అండ్రాయిడ్ ఫోన్లు అందజేయాలని, విద్యార్థుల భవిష్యత్ కొరకు వెచ్చిస్తున్న నిధులు రేపటి రోజున దేశ కొరకు ఉపయోగపడుతుందని వారు అన్నారు..అంతేకాకుండా ప్రస్తుతం ఫోన్ కొన్నివ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం అనే ధోరణి పిల్లలలో ఎక్కువగా ఉంటుందని,దిని నుంచి పిలల్లనూ రక్షించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు అనేవి..ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చదం గా తయ్యారైదనీ వారు తెలిపారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు తమ గ్రామాలకు రాని కరోనా.. ప్రస్తుతం విజంభించడంతో తాము ఆందోళన చేస్తున్నామని.. ఆన్లైన్ తరగతులు కన్నా నేరుగా పాఠాలు చెప్పడం వల్లన పిల్లలలో అభివృద్ది, పరిపక్వత చెందుతారని మేము ఆశిస్తున్నాం అని , లేకుంటే ప్రాశ్చాత్య నాగరికత వల్లన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మారుమూల గ్రామాల ఆదివాసీలు చెబుతున్నారు. మరో పక్క.. మధ్యతరగతి ఆదివాసీలు కుటుంబాలు మాత్రం మా పిల్లలు, ఇతర పిల్లలు కలిసి ఫోన్లలో, టీవీ లలో విద్యా బోధన చేయడం బాగుందని, విద్యార్థుల కు రక్షణ విద్యా బోధన చేరువవ్వుతున్నయని , పాఠాలు విన్న అనంతరం, ఆదివాసీల సంప్రదాయాలు, పొలం పనులు , ఆచారాలలో నేరుగా మొదటి సారి పాల్గొంటున్నారని, ఒక వైపు చదువుకుంటూ మరో వైపు వ్యవసాయం గూర్చి, సంప్రదాయాలు నేర్చుకోవడం ఆనందంగా వున్నదని వారు హర్షం వక్త్యం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆన్లైన్ తరగతులు అనేవి.. ఒకరికి బేధం.. మరొకరికి ఖేదం లా ఉన్నాయని ఆదివాసీ సంఘాల నాయకులు తెలుపుతున్నారు. మీడియా ప్రతినిధి వజ్జ హరి సాగర్.
Share it:

TELANGANA

Post A Comment: