CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసిన పవన్ కళ్యాణ్ సేవా సమితి

Share it:

అశ్వారావుపేట మండలం లో కరోనా కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసిన పవన్ కళ్యాణ్ సేవా సమితి మరియు పంచాయతీ సిబ్బంది
మన్యం టీవీ -అశ్వారావుపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దొంతు కుంటలో ఒకే కుటుంబంలో 5గురుకు కరోనా పాజిటివ్ వచ్చిన ఇంట్లో ఒక వృద్ధుడు మరణించడం జరిగింది. దహన సంస్కారాలకు గ్రామస్తులు ముందుకు రాకపోవటం వలన నక్క రాంబాబు వేముల ప్రతాప్ చొరవతో పవన్ కళ్యాణ్ సేవా సమితి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పిపిఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు చేశారు కరోనా కారణంగా మానవత్వం బంధుత్వం బాంధవ్యాలు ప్రేమానురాగాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ఇదే పరిస్థితి అశ్వరావుపేట దొంతు కుంట లో జరిగింది ఒకే కుటుంబంలో ఐదుగురి కరోనా వచ్చింది అదే కుటుంబంలో ఒక వృద్ధుడు అనారోగ్య కారణాలతో ఎప్పటినుంచో ఉండటం వలన మృతి చెందాడు హోమ్ ఐసోలేషన్ లో కుటుంబం మొత్తం ఉండటం వలన దహన సంస్కారాలు చేయలేక దీనావ్యవస్థలో ఉన్నారు కరోనా కారణంగా మానవత్వం కనుమరుగైన ఈ సమాజంలో ఆ వూరు వాళ్ళు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడం వలన ఇది గమనించిన అదే ఊరికి చెందిన నక్క రాంబాబు మరియు వేముల ప్రతాప్ సత్యనారాయణ అనే యువకులు చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్ సేవా సమితికి మరియు గ్రామ పంచాయతీకి తెలియపరిచారు పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షుడు డేగల రాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జెసిపి మాట్లాడి దాని సహాయంతో పంచాయతీ సిబ్బంది తో దహనసంస్కారాలు చేయించారు పవన్ కళ్యాణ్ సేవాసమితి ఈ ఒక్క మంచి పనే కాదు లాక్ డౌన్ సమయంలో సుమారుగా 50 రోజుల పాటు దాతల సహాయ సహకారాలతో లాక్ డౌన్ లో చిక్కుకున్న వందల మందికి ఆకలి తీర్చారు. ఇలా మంచి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షుడు డేగల రాము దాతలు పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయసహకారాలు అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని అన్నారు
Share it:

TELANGANA

Post A Comment: