CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు

Share it:

మన్యం టీవి : 
మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతోంది. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌లో చాట్‌ బ్యాగ్రౌండ్‌కు వాల్‌పేపర్‌ డిమ్మింగ్‌, డూడుల్స్‌ ఫీచర్లను  జోడిస్తున్నది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌ కోసం  వాట్సాప్‌  కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజాగా కొత్త వాల్‌పేపర్‌ ఫీచర్‌ను  తీసుకొచ్చింది.  వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.200.6 ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్‌ పబ్లిక్‌ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త ఫీచర్‌ కోసం బీటా ప్రొగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి.  

న్యూ ఫీచర్‌  వాల్‌పేపర్‌పై కూడా వాట్సాప్‌ పనిచేస్తోందని బీటా అప్‌డేట్‌ రివీల్‌ చేస్తున్నది. దీనికి 'వాల్‌పేపర్‌ డిమ్మింగ్'‌ అని  వాట్సాప్‌ పేరు పెట్టింది. చాట్‌ వాల్‌పేపర్‌ ఒపాసిటీని మార్చడానికి ఈ ఫీచర్‌ యూజర్లకు వీలుకల్పిస్తుంది. ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.   వాట్సాప్‌ పబ్లిక్‌ బీటా యూజర్లకు కూడా ఇది అందుబాటులో లేదు. 

చాట్‌ వాల్‌పేపర్‌ ఫీచర్‌పై  మాత్రమే  వాట్సాప్‌ పనిచేయట్లేదు. మునుపటి బీటా అప్‌డేట్‌లో వచ్చిన 'వాట్సాప్‌  డూడుల్స్'‌  ఫీచర్‌ను మరింత మెరుగ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.  వినియోగదారులు  చాట్‌ వాల్‌పేపర్లపై డూడుల్స్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌లో ఉంచుకొవచ్చు. కానీ, ఈ ఫీచర్‌ ఇంకా యూజర్లకు అందుబాటులో లేదు.  వాట్సాప్‌ ఈ ఫీచర్లను త్వరలోనే వినియోగదారులందరికీ పరిచయం చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది.
Share it:

TELANGANA

Post A Comment: