CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శాస‌న‌స‌భ‌లో చారిత్రాత్మ‌క రెవెన్యూ బిల్లు

Share it:



మన్యం టీవి : హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో చారిత్రాత్మ‌క‌ రెవెన్యూ బిల్లును ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. త‌ర‌త‌రాలుగా ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న బాధ‌ల‌కు చ‌ర‌మ‌గీతం పాడి ముఖ్యంగా రైతుల‌కు పేద‌ల‌కు స‌ర‌ళీకృత‌మైన‌టువంటి కొత్త చ‌ట్టాన్ని ఈ స‌భ‌లో ప్ర‌తిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాష్ర్టంలోని ప్ర‌తి కుటుంబానికి ఈ బిల్లు వ‌ర్తిస్తుంది. న‌వీన కాలంలో అనేక ఉత్ప‌త్తి సాధ‌న‌లు వ‌చ్చాయి. మ‌నిషి జీవితం భూమి చుట్టూ తిరిగింది. గ‌త ఐదారు వేల సంవ‌త్స‌రాల నుంచి వ్య‌వ‌సాయం చేయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌ట్నుంచి భూమిని ఉత్ప‌త్తి సాధనంగా గుర్తించ‌డంతో దాని విలువ పెరిగింది. నేటికి కూడా భూ స‌మ‌స్య‌లు ఉన్నాయి. భూ సంస్క‌ర‌ణ‌లు అనేవి ఒక ప‌ద్ధ‌తిలో చాన‌లైజ్ చేయాల‌ని చాలా జ‌రిగాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో అనేక రెవెన్యూ సంస్క‌ర‌ణ‌లు జ‌రిగాయి. పీవీ న‌ర‌సింహారావు, ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, వైఎస్ హ‌యాంలో కొన్ని మార్పులు జ‌రిగాయి. గ‌త పాల‌కులు రెవెన్యూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించ‌లేదు. రెవెన్యూ అధికారుల‌పై గ‌తంలో అనేక దాడులు జ‌రిగాయ‌ని సీఎం గుర్తు చేశారు
Share it:

TELANGANA

Post A Comment: