CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మారేడు గూడెం రోడ్డు ను పునరుద్ధరించాలి : ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

పినపాక :
పినపాక మండల కేంద్రానికి సమీపంగా ఉన్న గిరిజన గ్రామమైన మారేడు గూడెం రోడ్డు ను పునరుద్ధరించాలని ఆ గ్రామవాసులు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా పినపాక- మారేడు గూడెం గ్రామాల మధ్యన ఉన్నగ్రావెల్ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది దీనితో ఆ గ్రామం నుండి కాలినడకన వచ్చేవారు, ద్విచక్ర వాహనదారులు, వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఏదైనా అనుకోని సంఘటన జరిగినా ఆ గ్రామానికి అత్యవసర వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. తక్షణమే తమ రోడ్డు పునరుద్ధరించాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అధికారులను వేడుకుంటున్నారు.

##  పనులు ప్రారంభిస్తాం: నామని హరీష్ 

 మారేడు గూడెం రోడ్డు దెబ్బతిన్న విషయమై బోటి గూడెం పంచాయతీ కార్యదర్శి  నామని హరీష్ ని మన్యం  టీవీ వివరణ కోరగా ఆ రోడ్డు 1.5 మీటర్ల లోతు కోతకు గురవడం తో తాత్కాలిక మరమ్మతులకు కష్టంగా మారిందని తెలిపారు శుక్రవారం నుండి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
.... 
రిపోర్ట్ : కె. దామోదర్ గౌడ్, పినపాక
Share it:

TELANGANA

Post A Comment: