CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్త ఫీచర్ ను తీసుకువచ్చిన WHATSAPP..

Share it:


 ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూ యూజర్లను అప్ టూ డేట్ గా ఉంచడంలో వాట్సాప్ కు ఎవరూ సాటిలేరు అని కస్టమర్ల నుండి కితాబు వాట్సాప్ ఇప్పడు మరొక కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.    ఈ కొత్త ఫీచర్ ద్వారా రెండు ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. అంటే, ఒక నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ లో లాగ్ ఇన్ చేయవచ్చన్న మాట. ఈ కొత్త ఫీచర్ ను రీసెంట్ గా తీసుకువచ్చిన లింక్డ్ డివైజ్ ఫీచర్ కు అదనపు ఫీచర్ గా తీసుకువస్తోంది. 

అయితే, ప్రస్తుతానికి కొత్త ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ యొక్క స్టేబుల్ వెర్షన్ అందరికి అందుబాటులోకి తీసుకురావచ్చు.    వాట్సాప్ కొత్త ఫీచర్:    వాట్సాప్ యూజర్లు కేవలం ఒక ఫోన్ లో మాత్రమే వారి మొబైల్ నంబర్ తో వారి వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం వుంది. అయితే, ఇప్పుడు తీసుకువస్తున్న వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన లింక్డ్ డివైజ్ లకు ఇది బిన్నం. 

ఎందుకంటే, వాట్సాప్ యూజర్లు వారి ల్యాప్టాప్లు మరియు టాబ్లెట్లు వంటి నాలుగు ఇతర పరికరాలకు వారి అకౌంట్ లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, కంపెనీ ఇప్పుడు రెండు ఫోన్లలో ఒక వాట్సాప్ నంబర్కు లాగిన్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ తో డ్యూయల్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ అకౌంట్ వాడకం మరింత సులభతరం చేస్తుంది.    ఇక వాట్సాప్ తీసుకురావాలని కూడా యోచిస్తోంది. ఈ ఫీచర్ విషయానికి వస్తే, ఒక నిర్దిష్ట అకౌంట్ ప్రస్తుతం ఎన్ని డివైజ్ లలో లాగిన్ చేయబడిందో చెక్ చేయడానికి WhatsApp ఒక మార్గాన్ని అందిస్తుంది. వారి లాగిన్ వివరాలను ధృవీకరించడానికి వాట్సాప్ యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది మరియు వారి అకౌంట్ పైన మరింత భద్రతను ఇస్తుంది.

Share it:

TECHNOLOGY

Post A Comment: