CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తొలిసారి అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం

Share it:

 



హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌లోనే వెనుదిరిగిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. మూడు టీ20లు, వన్డేల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు..  శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి టీ20లో ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.  ఈ సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సీనియర్ బౌలర్లు మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉండగా.. టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ వెళ్లి కసరత్తులు ప్రారంభించింది. 

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టును పర్యవేక్షిస్తున్నాడు.   టైమింగ్స్..   ఈ పర్యటనలోనూ మూడు టీ20 మ్యాచ్‌లు నవంబర్ 18, 20, 22 తేదిల్లో జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 25, 27, 30 తేదీల్లోజరగనున్న మూడు వన్డేలు మాత్రం ఉదయం 7 గంటలకే మొదలవ్వనున్నాయి.  బ్రాడ్‌కాస్టింగ్ డిటైల్స్..    ఈ పర్యటనను బడా స్పోర్ట్స్ చానెళ్లు లైట్ తీసుకున్నాయి. దాంతో ఈ సిరీస్‌ల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తొలిసారి అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. 

డీడీ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు ఉచితంగా చూసే వెసులుబాటు ఉన్నా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.  టీమిండియా టీ20 టీమ్:    హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), రిషభ్‌పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మా  టీమిండియా వన్డే టీమ్:    శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

Share it:

SPORTS

Post A Comment: